రెయిన్ బో రెపరెపలు

సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు సంబరాలు చేసుకున్న ఎల్‌జిబిటి వర్గాలు మరిన్ని చారిత్రక తీర్పులకు ఆరంభం న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఎల్‌జిబిటి వర్గాలకు చెందిన వారు ఈ తీర్పుపై వేడుకలు జరుపుకొంటూ ఉంటే సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు మరిన్ని చారిత్రక తీర్పులకు ప్రారంభం అని అభివర్ణించారు. […]

సుప్రీం తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు
సంబరాలు చేసుకున్న ఎల్‌జిబిటి వర్గాలు
మరిన్ని చారిత్రక తీర్పులకు ఆరంభం

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై అన్ని వర్గాలనుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ఎల్‌జిబిటి వర్గాలకు చెందిన వారు ఈ తీర్పుపై వేడుకలు జరుపుకొంటూ ఉంటే సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు మరిన్ని చారిత్రక తీర్పులకు ప్రారంభం అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప తీర్పులకు సుప్రీంకోర్టు మార్గాన్ని సుగమం చేసిందని ఎల్‌జిబిటి హక్కుల ఉద్యమ కార్యకర్త అంజలి నాజియా అన్నారు.‘ఈ రోజు మాకు మౌలిక మానవ హక్కులు లభించాయి. మేము ఎంత సంతేషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేము’ అని నాజియా అన్నారు. సుప్నీం తీర్పును చరిత్రాత్మకమైనదిగా స్వచ్ఛంద సంస్థ ‘స్పేస్’ సభ్యురాలు అంజన్ జోషీ అఅభివర్ణిస్తూ, సమానత్వం కోసం తాము జరిపే పోరాటానికి ఈ తీర్పు తోడ్పడుతుందన్నారు.

ఇది ప్రారంభం మాత్రమే. దత్తత హక్కు, వివాహం హక్కు లాంటి వాటి విషయంలో మేము ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉందని మాకు తెలుసు. అయితే ఇది చాలా స్వాగతించదగ్గ ప్రారంభం’ అని జోషీ అన్నారు. ఈ తీర్పు ఇంకా ముందే వచ్చి ఉంటే బాగుండేదని ఈ వర్గానికి చెందిన చాలా మంది అభిప్రాయపడ్డారు. కాగా ఇది ప్రేమ, చట్టానికి లభించిన విజయంగా అలయన్స్ ఇండియా సిఇఓ సోనాల్ మెహతా అఖిప్రాయపడ్డారు. ఎట్టకేలకు తాము నేరగాళ్లము కాదని రుజువయిందని, తమకు కూడా సమాజంలో ఒక గుర్తింపు లభించిందని స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం సాగిస్తున్న అర్పిత్ భల్లా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్‌లో ఈ తీర్పును స్వాగతించింది. సుప్రీం తీర్పు విని చాలా సంతోషమైందని, ఈ తీర్పు లోక్‌సభలో తన వైఖరిని తప్పుబట్టిన బిజెపి ఎంపిలకు చెంపపెట్టని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ వ్యాఖ్యానించారు. భిన్నత్వాన్ని అంగీకరించినప్పుడే భారత దేశం మనగలుగుతుందని ప్రముఖ రచయిత చేతన్ భగత్ అఖిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని మహిళా హక్కుల ఉద్యమ కార్యకర్త రితుపర్ణ బేరా అంటూ, ఈ తీర్పు ఓ మైలురాయని అన్నారు. అయితే పోలీసు హింస, దత్తత హక్కు, వివాహ హక్కు లలాంటి అనేక సమస్యలు ఇంకా ఉన్నాయని ఆమె అన్నారు. స్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్, పలువురు బాలీవుడ్ సులబ్టిలు సైతం సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

డ్యాన్స్ చేసిన హోటల్ సిబ్బంది

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ఢిల్లీలోని లలిత్ హోటల్ సిబ్బంది వేడుకలు జరుపుకొన్నారు. అందరూ కలర్‌ఫుల్ డ్రెస్‌లతో డ్యాన్స్ చేస్తూ ఇతరులను కూడా తమతో కలిసి డ్యాన్స్ చేయాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆనందానికి కారణం లేకపోలేదు. సెక్షన్ 377ను సవాలు చేస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఆ హోటల్ యజమాని కేశవ్ సూరి కూడా ఉన్నారు. ఇంద్ర ధనుస్సు రంగుల్లో ఉండే స్కార్ఫ్‌ను మెడలో ధరించి, చేతికి చుట్టుకుని హోటల్ స్టాఫ్ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. మిగతా వారిని కూడా తమతో జత కలవాలని ఆహ్వానించారు. కాగా ఈ విషయంలో కృషి చేసిన న్యాయవాదులకు, జడ్జిలకు సూరి కృతజ్ఞతలు తెలిపారు. పండుగను జరుపుకోవడానికి ఇది పెద్ద సమయమని ఆయన వ్యాఖ్యానించారు.

చట్టబద్ధతనిచ్చిన 26వ దేశం భారత్

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 25 దేశాలు స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించి, దానికి చట్టబద్దత కల్పించిన 25 దేశాల సరసన ఇండియా చేరింది. పరస్పర అంగీకారంతో జరిపే స్వలింగ సంపర్కం నేరం కాదని, ఐపిసి సెక్షన్ 377 చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడంతో దానికి చట్టబద్ధత కల్పించిన 25 దేశాల తరువాత 26వ దేశంగా భారత్ నిలిచింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్వలింగ సంపర్కం నేరం కాదని ప్రకటించడంతో భారతదేశంలో వారి పట్ల ఇప్పటి వరకు కొనసాగిన వివక్ష అంతమవుతుందని బాధితులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికీ స్వలింగ సంపర్కం నేరమని ప్రంపచంలో 72 దేశాల చట్టాలు చెప్తున్నాయి.8 దేశాలు స్వలింగ సంపర్కులకు మరణశిక్ష, కారాగార శిక్ష విధిస్తున్నాయి. స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేయాలని కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ 2015లో లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ప్రైవేట్ బిలుని ్ల బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తిరస్కరించింది.
చట్టబద్ధం చేసిన దేశాలు
1. అర్జెంటీనా 2. ఆస్ట్రేలియా 3. బెల్జియం 4. బ్రెజిల్ 5. కెనడా 6. కొలంబియా 7. డెన్మా ర్క్ 8. ఫిన్లాండ్ 9. ఫ్రాన్స్ 10 . జర్మనీ 11. ఐస్‌లాండ్ 12. ఐర్లాండ్ 13. లగ్జెంబర్గ్ 14. మాల్టా 15. మెక్సికో 16. నెదర్లాండ్స్ 17. న్యూజిలాండ్ 18. నార్వే 19. పోర్చుగల్ 20. దక్షిణ ఆఫ్రికా 21. స్పెయిన్ 22. స్వీడన్ 23. యునైటెడ్ కింగ్‌డం 24. యునైటెడ్ స్టేట్స్ 25. ఉరుగ్వే 26. ఇండియా .

Comments

comments

Related Stories: