రెండు లారీలు ఢీ: ఒకరి మృతి

Lorry Driver Died In Road Accident

హుజూర్‌నగర్‌ః  పట్టణంలోని లింగగిరి, మట్టపల్లి బైపాస్ రోడ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఇద్దరు డ్రైవర్లను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో మేళ్ళచెర్వుకు చెందిన దండు బాలరాజు (40) పిరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు మృతి చెందాడు. బాలరాజు సోదరుడు కావలి బాలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ యస్‌ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.

Comments

comments