రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్!

హైదరాబాద్: వచ్చే ఆది, సోమవారాల్లో భాగ్యనగరంలో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. నగర వ్యాప్తంగా పలు అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం, సోమవారాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బార్లు, పబ్బులను కూడా మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి […]

హైదరాబాద్: వచ్చే ఆది, సోమవారాల్లో భాగ్యనగరంలో మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడనున్నాయి. నగర వ్యాప్తంగా పలు అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్తగా ఆదివారం, సోమవారాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బార్లు, పబ్బులను కూడా మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్‌ తెలిపారు. పోలీసుల ఆదేశాలు కాదని మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

comments

Related Stories: