రెండు పడకల ఇండ్ల్ల నిర్మాణానికి సర్కారు సన్నద్ధం

క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం, జిల్లాలో తొలి దశ 4 వేల ఇండ్లు, మంత్రి, ఎంఎల్‌ఎలు సూచించిన వారికే ప్రాధాన్యత ఖమ్మం అర్బన్‌లో స్థల సేకరణకు సర్వే! నేడు ఎంఎల్‌ఎలతో సమీక్ష తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది… తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది… 125 గజాల్లో సువిశాలంగా ఇల్లు ఉండేలా మోడల్‌ను రూపొందించింది… దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే జిల్లాలకు పంపింది… జీఓ నంబర్ 10ని […]

క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం, జిల్లాలో తొలి దశ 4 వేల ఇండ్లు, మంత్రి, ఎంఎల్‌ఎలు సూచించిన వారికే ప్రాధాన్యత
ఖమ్మం అర్బన్‌లో స్థల సేకరణకు సర్వే!
నేడు ఎంఎల్‌ఎలతో సమీక్ష

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సర్వం సిద్ధమైంది… తొలిదశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది… 125 గజాల్లో సువిశాలంగా ఇల్లు ఉండేలా మోడల్‌ను రూపొందించింది… దీనికి సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే జిల్లాలకు పంపింది… జీఓ నంబర్ 10ని పటిష్టంగా అమలుచేయాలని ఆదేశాలు జారీ చేసింది… దీనిలో భాగంగానే జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఖమ్మం కలెక్టరేట్: ప్రభుత్వం చేపట్టనున్న మరో కొత్త కార్యక్రమం డబుల్ బెడ్ రూం పథకం. దీనికి సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం సైతం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అర్హులకే ఇండ్లు కేటాయించేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో ఇప్పటికే పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగం గానే ఖమ్మం అర్బన్ మండలంలో ఇప్పటికే స్థల సేకరణకు సంబంధించి సర్వే సైతం పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

అసెంబ్లీ నియోజకవర్గానికి 400 ఇండ్లు : పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కొక్క నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించాలని సర్కారు భావిస్తోంది. జిల్లాలో 10 నియోజకవర్గాలకు మొత్తం 4 వేల ఇండ్ల్లు నిర్మించాలని నిర్ణయించింది. 125 గజాల్లో ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యే సూచించిన 200 మంది, మంత్రి సూచించిన 200 మందికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. దీని ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. అయితే ఎంఎల్‌ఎ, మంత్రి సూచించిన తర్వాత తిరిగి తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రక్రియ పూర్త యిన తర్వాత నివేదికను సమర్పిస్తారు. ఈ ఇళ్ల నిర్మాణం సామూహిక గృహాలు ఉండేలా స్థల సేకరణ చేపట్టాలని కలెక్టర్ డీఎస్ లోకేశ్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నేడు ఎమ్మెల్యేలతో సమీక్ష: డబుల్ బెడ్‌రూం పథకానికి సంబంధించి జిల్లాలోని శాసన సభ్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన నున్నారు. జిల్లాలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిం చనున్నారు. పథకం తీరు తెన్నును ప్రజా ప్రతినిధులకు వివరిం చనున్నారు. లబ్ధిదారుల ఎంపిక.. తదితర విషయాలపై సమీక్షించనున్నారు.

Comments

comments

Related Stories: