రెండు పంటలకు సాగునీరు

Water for two crops

సరళా సాగర్ ఆయకట్టు రైతులకు.. రెండు పంటలకు సాగునీరు
మిషన్‌కాకతీయలో రూ.2కోట్ల 40లక్షల నిధులతో ప్రాజెక్టు పూడికతీత: ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

మన తెలంగాణ/మదనాపురం: సరళాసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పొలాలకు రెండు పంటలకు సాగునీరందిస్తామని ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.సరళాసాగర్ ప్రాజెక్టులోని పలు అభివృద్ధి పనులను ఎంఎల్‌ఎల్ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2కోట్ల40 లక్షల నిధులతో సరళాసాగర్ పనులను చేపట్టామని తెలిపారు. ఊకశెట్టు వాగు నుండి వరద వచ్చి ప్రాజెక్టులో ఒండుమట్టి చేరడం వల్ల ఆయకట్టు రైతుల పొలాలకు ఒకే పంటకు సాగునీరు అందడంతో రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రాజెక్టు పనులను చేపట్టామన్నారు. అదే విధంగా మిషన్‌కాకతీయ పనుల్లో భాగంగా సరళా సాగర్ ప్రాజెక్టు పూడిక తీయడం వల్ల ఆయ కట్టు రైతుల పొలాలకు రెండు పంటల సాగు కోసం సాగునీరు అందజేయడం సులభమన్నారు. మిషన్ కాకతీయపనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్, ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి మండలరైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మదనాపురం మండల
కేంద్రంలోని మసీద్ ఆవరణలో వస్త్ర దుకాణాన్ని ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి గుంతమౌనిక, మార్కెట్ చైర్మన్ రాజేశ్వరిభీంరెడ్డి, టిఆర్‌ఎస్ మండలాధ్యక్షులుకృష్ణయ్య యాదవ్,సర్పంచ్‌లుఆవుల భాగ్యమ్మ, సునితా రాజవర్ధన్‌రెడ్డి, ఎంపిటిసిలు వెంకట్ నారాయణ, మాసన్న, కోట్ల తిరుపతయ్య, నాగరాజుగౌడ్, జిల్లా రైతుసమన్వయ సమితి సభ్యులు రవీందర్‌రెడ్డి, హన్మన్‌రావు, బాలకృష్ణ, సాయిలు,
ప్రవీణ్‌రెడ్డి, వాసిరెడ్డి, శంకర్, రంగ న్న,సత్యం, మైనార్టీ అధ్యక్షులు చాంద్‌పాషా, అన్వర్, రఫీ, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments