రూ.3 వేల కోట్లు వసూలు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: కాలం చెల్లిన పద్ధతులు కాకుండా ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాబడి పెం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించారు. ప్రతినెలా 3వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా ఉద్యో గులు అంకిత భావంతో పనిచేయా లని, శాఖను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సచివాలయం లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆ శాఖపై సమీక్షా సమా […]

మనతెలంగాణ/హైదరాబాద్: కాలం చెల్లిన పద్ధతులు కాకుండా ఆధునిక సాంకే తిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రాబడి పెం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించారు. ప్రతినెలా 3వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేలా ఉద్యో గులు అంకిత భావంతో పనిచేయా లని, శాఖను బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సచివాలయం లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆ శాఖపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. గత రెండు మూడు నెలల నుంచి రాబడి క్రమంగా పెరుగు తోందని, అక్రమాలను నిరోధించి ఈ ఏడాది చివరి కల్లా మూడువేల రూపాయలకు పెంచాలని కోరారు. ఇక నుంచి క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించి, నిర్ణయాలు సమీక్షించు కుందామని ముఖ్యమంతి అధికారులకు హామీ ఇచ్చారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెం చాలని, ప్రతి చెక్‌పోస్టు వద్ద ఇద్దరు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్లను ఇచ్చేందుకు సిద్ధమేనని ఆయన అన్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను ఆధునీకరించేం దుకు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అధ్య యనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్వచ్ఛంద పన్నుల చెల్లింపు విధానాన్ని ప్రోత్స హించాలని, ఉత్తమమైన పన్ను వసూలు పద్ధతు లను అధ్యయనం చేయాలని ఆయన కోరారు. మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాల్లో పన్నులు తక్కు వగా ఉన్నట్లయితే ఆ వివరాలను తనకు అందజేయాలని ముఖ్యమంత్రి కోరారు. పన్నులు తగ్గించడం మూలంగా ఆదాయం పెరుగుటతుందని భావిస్తే తగ్గించేందుకు అనుమతిస్తానని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో అధికార స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, మిగిలిన ఖాళీలను కూడా దశల వారీగా భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. తమ శాఖపై ఎంత ఖర్చు చేస్తే అంతకన్నా రెట్టింపు ఆదాయం వస్తుందని, ఖాళీలను భర్తీ చేయాలని, కార్యాల యాలను ఆధునీకరించాలని అధికారులు కోరగా ముఖ్యమంత్రి సాను కూలంగా స్పందించారు. ఈ సమావేశంలో సిఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, శాంతకుమారి, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకా ర్యదర్శి అజయ్ మిశ్రా, వాణిజ్య పన్నుల కమిషనర్ వి.అనిల్ కుమార్, జియింట్ కమిషనర్లు ఎ.చంద్రశేఖర్ రెడ్డి, బి.రేవతి రోహిణి పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: