రూ.1500 కోసం 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యం!

లక్నో: కేవలం రూ. 1500 అప్పు తీర్చలేదని 17 ఏళ్ల బాలికపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ సంఘటన యుపిలోని మురుద్ నగర్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా నివాసముండే యువతి కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేసి ఫ్యామిలీ బాధ్యతలు మోస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో అవసరాల నిమిత్తం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు […]

లక్నో: కేవలం రూ. 1500 అప్పు తీర్చలేదని 17 ఏళ్ల బాలికపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ సంఘటన యుపిలోని మురుద్ నగర్ లో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… స్థానికంగా నివాసముండే యువతి కుటుంబం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేసి ఫ్యామిలీ బాధ్యతలు మోస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో అవసరాల నిమిత్తం జాహిద్, మోహన్ పాల్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద బాధితురాలు రూ. 1500 అప్పు తీసుకుంది. ఈ క్రమంలో అప్పు తీర్చాలంటా యువతిపై వారిద్దరూ గత కొంతకాలంగా ఒత్తిడి తేస్తున్నారు. కానీ, ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని సర్దుబాటు కాగానే ఇస్తానంటూ ఆమె చెబుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో మరోసారి వారు బాలికను అప్పు తీర్చాల్సిందేనంటూ బెదిరించారు. వేరే ప్రాంతానికి సైకిల్ పై వెళ్లి తిరిగి వస్తున్న బాలికను జాహిద్, మోహన్ లు అడ్డుపడి మళ్లీ అప్పు గురించి అడిగారు. దానికి ఆమె తనకు కొంత సమయం కావాలని చెప్పింది. దీంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: