రూపాయి మరింత పతనం

డాలరుతో రూపాయి విలువ 70.52                                                                                                        […]

డాలరుతో రూపాయి విలువ 70.52                                                                                                                   జీవితకాల కనిష్టానికి చేరిన విలువ

న్యూఢిల్లీ : రూపాయి మళ్లీ భారీగా పతనమైంది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి బుధవారం జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. విదేశీ ఎక్స్ఛేంజీ మార్కె ట్లో 42 పైసలకు పైగా పడిపోయి జీవనకాల కనిష్టం 70.52ను తాకింది. డాలర్ డిమాండ్ పెరగడంతో రోజు రోజుకీ రూపాయి విలువ పడిపోతూ వస్తోంది. క్రితం సెషన్‌లో రూ.70.10 వద్ద ముగిసిన రూపాయి బుధవారం నాటి ట్రేడింగ్‌లో మరింత పతనమై రూ.70.32 వద్ద కనిష్ఠ స్థాయిలో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకు ఆయిల్ రిఫైనర్స్ నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డాలరుతో మారకంలో రూపాయి 9.5 శాతం పతనమైంది.

పతనానికి కారణాలేమిటి?
ముడిచమురు ధరలు మళ్లీ పెరగుతూ వస్తుండడంతో రూపాయి మారకపు విలువపై ప్రభావం చూపుతోంది. వాణిజ్య వివాద పరిష్కారాల దిశలో మెక్సికో, కెనడాలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంటోంది. 1994లో కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)ను వ్యతిరేకిస్తున్న ట్రంప్ ప్రభుత్వం అప్పటి ఒప్పందాలను పూర్తిస్థాయిలో పునఃసమీక్షిస్తోంది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. వృద్ధి బాటలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతోపాటు ద్రవ్యోల్బణ నియంత్రణకు క్రమంతప్పని వడ్డీ రేట్ల పెంపు సహకరించగలదని గత వారం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో డాలరు బలపడుతుంటే.. ఆసియా కరెన్సీలు బలహీనపడుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. దేశీయంగానూ జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

1. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రారంభంలో 70.30కి పతనమైంది. క్రితం రోజు 70.10 పైసల వద్ద రూపాయి ఒక్కసారిగా 20 పైసలు పడిపోయింది. ఆ తర్వాత మరింతగా 42 పైసలు పడిపోయి 70.52 వద్ద కొనసాగింది. ఇది జీవితకాల కనిష్ట పతనం.

2. ఆసియన్ ట్రేడ్‌లో కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలర్ విలువ మరింత బలపడింది చైనా అమెరికా వాణిజ్య యుద్ధం ఆందోళనలు రేకెత్తించగా, అమెరికా మెక్సికో వాణిజ్య ఒప్పందం మాత్రం కొంత ఊరటనిచ్చింది.

3. వాణిజ్య లోటు కూడా పెరగడం రూపాయిపై ప్రభావం చూపింది. వాణిజ్య లోటు దాదాపు ఐదేళ్ల గరిష్ఠ స్థాయి 18 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

4. బ్యాంకులు, ఆయిల్ రిఫైనర్స్ నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి పతనానికి కారణమయ్యాయి గత సెషన్‌లో రూపాయి 70.16 వద్ద జీవితకాల కనిష్టానికి పడిపోయిన రూపాయి.. మంగళవారం 6 పైసలు కోలుకుంది.

5. అమెరికా, మెక్సికో ట్రేడ్ డీల్‌పై ఆశావాహంతో బుధవారం ఆసియన్ మార్కెట్లలో షేర్లు లాభాలను నమోదు చేశాయి.

Comments

comments

Related Stories: