రుణమాఫీలో అనర్హులకు అందలం

అధికారులు, బాంకర్ల మధ్య సమన్వయలోపం అన్నదాతతో అధికార యంత్రాంగం చెలగాటం మొదటి విడత రుణమాఫీలో అక్రమాలు! రెండో విడత పంపిణీకి సర్కారు సనద్ధం అధికారుల వక్రబుద్ధి మరోమారు బట్టబయలైంది! మొదటి విడత రుణమాఫీ తీరు విస్మయానికి గురిచేస్తోంది! ఒకటికాదు, రెండు కాదు కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది! కాగితాల్లోని లెక్కలకు, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది! పహణీల్లో లేకపోయినా, శిఖం భూములైనా రుణాలు మాఫీ చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది! సర్కారు […]

అధికారులు, బాంకర్ల మధ్య సమన్వయలోపం

అన్నదాతతో అధికార యంత్రాంగం చెలగాటం
మొదటి విడత రుణమాఫీలో అక్రమాలు!
రెండో విడత పంపిణీకి సర్కారు సనద్ధం

అధికారుల వక్రబుద్ధి మరోమారు బట్టబయలైంది! మొదటి విడత రుణమాఫీ తీరు విస్మయానికి గురిచేస్తోంది! ఒకటికాదు, రెండు కాదు కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది! కాగితాల్లోని లెక్కలకు, ప్రస్తుత పరిస్థితికి పొంతన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది! పహణీల్లో లేకపోయినా, శిఖం భూములైనా రుణాలు మాఫీ చేయడం అక్రమాలకు అద్దం పడుతోంది! సర్కారు రెండో విడత రుణమాఫీకి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ విడతలోనైనా రుణాల పంపిణీ సక్రమంగా జరుగుతాయా, లేదో చూడాలి.

ఖమ్మం కలెక్టరేట్: అన్ని అర్హతలున్నా రుణాలు మాఫీ కాలేదని. నిత్యం ఎందరో రైతులు ఉన్నతాధికారులు విన్నవించుకుం టున్నారు. కలెక్టర్ నిర్వహించే ప్రతీ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఈ దరఖా స్తులు తప్పని సరైపోయాయి. రైతుల చెప్పులరు గుతున్నాయే తప్ప పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. గతంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రుణమాఫీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సభ్యులు గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. జిల్లాలో మొత్తం రూ.1711.39 కోట్లు రుణమాఫీ కింది విడుదలయ్యాయి. వీటిలో మొదటి విడుతగా 25శాతం.. అంటే రూ.427 కోట్లు సర్కారు విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 3,80,009 మంది రైతులుండగా వీరిలో 3,58,026 మంది రుణమాఫీ జరిగింది. దీనికి గాను రూ.408.34 కోట్ల సొమ్ము బ్యాంకుల్లోని రైతుల ఖాతాలో జమైంది. ఒక పక్క అన్ని అర్హతలున్నా రుణమాఫీ జరగలేదని రైతులు గగ్గోలు పెడుతుంటే.. అధికారులు మాత్రం రుణమాఫీ అయిపోయిన తర్వాత రూ.18 కోట్లు మిగిలాయని తిరిగి పంపించివేయడం గమనార్హం.

ఇష్టారాజ్యం: రుణమాఫీ జాబితాను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఒక సిస్టంను ఏర్పాటు చేసింది. క్షేత్రస్తాయిలో గ్రామ రెవెన్యూ అధికారి నుంచి, ఆర్‌ఐ, మండల వ్యవసాయాధికారి, తహశీల్దార్, మండల ప్రత్యేకాధికారి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఇలా అందరూ పరిశీలించి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత జాబితాను సిద్ధం చేయాలి. ఆ తర్వాత తహశీల్దార్ మారోసారి జాబి తాను పరిశీలించి బ్యాంకర్లకు నివేదించాలి. అప్పుడు బ్యాంకు అధికారులు మాఫీ అయిన సొమ్మును రైతు ఖాతాలో జమచేయాలి. కానీ జిల్లాలో ఇలా జరిగిన తీరు చాలా తక్కువనే ఆరోపణలు ఉన్నాయి.
అక్రమాలకు ఆనావళ్లు: కల్లూరులో తహశీల్దార్ ప్రొసీడింగ్ లేకుండా ఓ బ్యాంక్ మేనేజర్ సుమారు 70మందికి రుణమాఫీ చేసినట్టు తెలిసింది. కారేపల్లి మండలంలో నాలు గు కుటుంబాలకు రెండుసార్లు రుణమాఫీ జరిగిట్టు సమా చారం. బోనకల్ మండలంలో అసలు సర్వే నంబరే లేకుండా రుణమాఫీ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎక్కువ మండలాల్లో ఇవే తప్పులు జరిగాయనేది సుస్పష్టం. జిల్లా ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి రుణమాఫీలో జరిగిన అవినీతిని బయటకు తీయాలని, అర్హులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని రైతులు కోరుకుంటున్నారు.

Comments

comments

Related Stories: