రిలే మహిళా జట్టుకు స్వర్ణం

జకార్తా: అథ్లెటిక్స్ ఈవెంట్ మహిళల 4 x 400 రిలేలో భారత మహిళా జట్టు స్వర్ణాన్ని దక్కించుకుంది. కాగా పురుషుల రిలే జట్టు రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. భారత మహిళల రిలే జట్టు వరుసగా ఐదోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆసియాలో తమకు తిరుగులేదని నిరూపించింది. హిమాదాస్, పూవమ్మ, సరితాబెన్, విస్మయలతో కూడిన జట్టు 3.28.72 నిమిషాల్లో లక్షాన్ని ఛేదించి భారత్‌కు మరో స్వర్ణాన్ని సాధించిపెట్టింది. తొలుత హిమాదాస్ భారత్‌కు శుభారంభం చేసింది. వేగంగా పరుగెత్తి బ్యాటన్‌ను […]

జకార్తా: అథ్లెటిక్స్ ఈవెంట్ మహిళల 4 x 400 రిలేలో భారత మహిళా జట్టు స్వర్ణాన్ని దక్కించుకుంది. కాగా పురుషుల రిలే జట్టు రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. భారత మహిళల రిలే జట్టు వరుసగా ఐదోసారి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆసియాలో తమకు తిరుగులేదని నిరూపించింది. హిమాదాస్, పూవమ్మ, సరితాబెన్, విస్మయలతో కూడిన జట్టు 3.28.72 నిమిషాల్లో లక్షాన్ని ఛేదించి భారత్‌కు మరో స్వర్ణాన్ని సాధించిపెట్టింది. తొలుత హిమాదాస్ భారత్‌కు శుభారంభం చేసింది. వేగంగా పరుగెత్తి బ్యాటన్‌ను రెండో క్రీడాకారిణికి అందించింది. మిగతా వారంతా అదే వేగం కొనసాగించడంతో స్వర్ణ పతకం స్వంతమైంది. 2002 నుంచి ఈ ఈవెంట్‌లో భారతీయ క్రీడాకారిణీలు విజయపరంపరను కొనసాగిస్తున్నారు. బహ్రెయిన్(3.30.62 నిమిషాలు), వియత్నాం (3.33.23నిమిషాలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా పురుషుల 4 X 400 రిలేలో మహ్మద్ కున్హూ, ధరుణ్ అయ్యస్వామి, మహ్మద్ అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన జట్టు రజత పతకం గెలుచుకుంది. వీరి జట్టు లక్షాన్ని 3.01.85 నిమిషాల్లో రిలే పరుగును పూర్తిచేసింది.

Related Stories: