రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు

petrol price has hit a record high

పెట్రోల్‌పై 16పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెంపు
అన్ని మెట్రో నగరాలలో కన్నా ఢిల్లీలోనే ధర చౌక
అనేక రాష్ట్రాలు అమ్మకం పన్ను లేక వ్యాట్ తగ్గించాల్సి ఉంది

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం దేశంలోని నాలుగు మెట్రోనగరాల్లో మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఒఎంసిలు) పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్ ఢిల్లీలో రూ. 78.68, ముంబయిలో రూ. 86.09, కోల్‌కతాలో రూ. 81.60, చెన్నైలో రూ. 81.75గా ఉంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు రోజువారీ ధరల ప్రకారం ఈ రేట్లను శనివారం అమ లు చేశారు. కాగా శుక్రవారం ఢిల్లీలో డీజిల్ ధర ఏడాదిలోనే గరిష్ఠంగా లీటరుకు 28 పైసలు పెం చారు. తాజాగా పెంచిన ఇంధన ధర లు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇంధన ధరలు ఢిల్లీలోనే చౌకగా ఉన్నా యి.ఇతర రాష్ట్రాల్లో కూడా చౌక కావాలంటే అమ్మకం పన్ను లేక వ్యాట్ తగ్గించుకోవలసి ఉంటుంది. ఢిల్లీ పెట్రోల్‌పై 27 శాతం, డీజిల్‌పై 17.24 శాతం విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చార్జీ చేస్తోంది. పెట్రోల్‌పై మొత్తం పన్ను 45 నుంచి 50 శాతంగా, డీజిల్‌పై 35 నుంచి 40 శాతంగా ఉంది. శుక్రవారం చమురు ధరలు తగ్గాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆంక్ష లు, వెనీజులా ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు తగ్గాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ 42 సెంట్లు తగ్గి బ్యారె ల్ 77.35 డాలర్ల ధరపలుకుతోంది. అమెరికా ముడిచమురు ధర 36 సెంట్లు తగ్గి బ్యారెల్ 69.89 డాలర్లుగా ఉంది. ఇదిలా ఉండగా డాలరు మారకంతో రూపాయి విలువ 71కిపడిపోయింది.