రికార్డు స్థాయికి చేరిన డీజిల్ ధర

Diesel prices hit a record high

న్యూఢిల్లీ: డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతూ వాహనాదారులను బెంబేలెత్తిస్తున్నాయి. డీజిల్ రేట్లు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. దీంతో ఢిల్ల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 69.61, పెట్రోలు 78కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు డీజిల్ ధర రూ.73.90కు చేరగా, కోల్‌కతాలో రూ.73.54గా ఉంది. ఇక చెన్నైలో డీజిల్ లీటరు రూ.73.54గా ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఒసిఎల్) పేర్కొంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో పాటు వెనుజువెలాలో ఆర్థిక సంక్షోభం, అలాగే ఆఫ్రికా, ఇరాన్ దేశాల నుంచి సరఫరా తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.