రికార్డుల మోత మోగిస్తోంది…

  మెటల్, ఇన్‌ఫ్రా, ఆటో రంగ షేర్ల ర్యాలీ                                                                                                  […]

 

మెటల్, ఇన్‌ఫ్రా, ఆటో రంగ షేర్ల ర్యాలీ                                                                                                              11,550 పాయింట్లు దాటిన నిఫ్టీ 

న్యూఢిల్లీ: బుల్ దూకుడు ఆగడం లేదు. సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి సరికొత్త శిఖరాలను తాకాయి. బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 330 పాయింట్లు లాభపడి 38,278 పాయింట్లకు చేరుకుంది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 11,551 పాయింట్ల వద్ద స్థిరపడింది. మెటల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటో రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్ల జోరు మార్కెట్ భారీ లాభాల వైపు నడిపించింది. నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్‌గా లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, టాటా స్టీల్, హిందా ల్కో కంపెనీలు నిలిచాయి. ఈ షేర్లు 3 నుంచి 6 శాతం మధ్య లాభాలు నమోదు చేశాయి. ఓ దశలో సెన్సెక్స్ 38,340 పాయింట్లు, నిఫ్టీ 11,565 పాయింట్లతో చరిత్రాత్మక గరిష్ట రికార్డులను నమోదు చేశాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు చెక్ పెట్టేందుకు మంగళవారం నుంచి చర్చలు జరగనుండడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్లు లాభపడగా,దేశీయంగానూ బుల్ ట్రెండ్ నెలకొన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగా లూ లాభపడ్డాయి. అయితే ఐటి 1శాతం నష్టపోగా.. మెటల్ 2.6 శాతం, పిఎస్‌యు బ్యాంక్స్, ఆటో, ఫార్మా 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్ అండ్ టి 7 శాతం లాభపడి అందరినీ ఆశ్చర్యపర్చింది.

టాటా మోటార్స్ 5 శాతం పెరిగింది. మార్కెట్లు ఊపందుకోవడంతో చిన్న షేర్లకూ డిమాండ్ పెరిగింది. బిఎస్‌ఇ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ స్వల్పంగా బలపడింది. బిఎస్‌ఇలో ట్రేడైన మొత్తం షేర్లలో 1,464 లాభపడగా, 1281 మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఎల్ అండ్ టి బైబ్యాక్ ప్రతిపాదన ఫలితంగా ఆ షేరు 6 శాతంపైగా పెరిగి రూ. 1,320 స్థాయికి ఎగిసిం ది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబా, రిలయ న్స్ రిటైల్‌లో భారీగా పెట్టుబడి చేయనున్నదనే నేపథ్యం లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.5 శాతంపైగా పెరిగింది. శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ.147 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 152 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.

ఇన్ఫోసిస్ 3 శాతం డౌన్ : ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఒ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) రంగనాథ్ రాజీనామా చేయడంతో కం పెనీ షేరు డీలాపడింది. ఈ షేరు 3 శాతం క్షీణించి రూ. 1,388 వద్ద ముగిసింది.గెయిల్,టైటాన్,హెచ్‌సిఎల్ టెక్, లుపిన్ షేర్లు 1- నుంచి 2 శాతం మధ్య పతనమయ్యా యి.

మెటల్ షేర్ల జోరు : మెటల్ షేర్ల ర్యాలీతో వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఎన్‌ఎస్‌ఇ మెటల్ ఇండెక్స్ 2.5 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మెటల్‌కు సానుకూలంగా మారాయి. ఫార్మా సూచీ 1 శాతానికి పైగా పెరిగింది. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 0.52 శాతం లాభంతో 28,275 పాయింట్ల వద్ద ముగిసింది.

Related Stories: