రాహుల్ అడుగు పెడితే కాంగ్రెస్ ఢమాల్

ఎ టు జెడ్ అవినీతి కాంగ్రెస్‌దే… అక్కడ గెలవలేని ఇక్కడేం ఆయన ఒరగబెడతాడు, డిజైన్ సక్కగుంటే రీడిజైన్ ఎందుకు చేస్తాం, ఎపి ప్రత్యేక హోదా అన్నాడు, తెలంగాణకు ఏమిస్తాడో చెప్పలేదు: కెటిఆర్ మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎ టూ జెడ్ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ అభివృద్ది పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే […]

ఎ టు జెడ్ అవినీతి కాంగ్రెస్‌దే… అక్కడ గెలవలేని ఇక్కడేం ఆయన ఒరగబెడతాడు, డిజైన్ సక్కగుంటే రీడిజైన్ ఎందుకు చేస్తాం, ఎపి ప్రత్యేక హోదా అన్నాడు, తెలంగాణకు ఏమిస్తాడో చెప్పలేదు: కెటిఆర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎ టూ జెడ్ అవినీతికి పాల్పడిందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్ గ్రౌండ్ అభివృద్ది పనులకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ గత 56 ఏళ్లలో ప్రభుత్వాలు సాధించని అభివృద్ధిని మంత్రి టిఆర్‌ఎస్ బుధవారం ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాలుగేళ్ళలో సాధించిందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని కురచ పార్టీల నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నాయని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కరీంనగర్‌లో వందల కోట్లతో అతివేగంగా పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సీఎం చొరవతో రూ.34 కోట్లతో స్మార్ట్ రోడ్లు, 326 కోట్లతో ఇవాళ ఒక్కరోజే కరీంనగర్ నియోజకవర్గంలో అభివృధ్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

ప్రజలు ఛీ కొట్టినా కొంత మంది ప్రతిపక్ష నాయకులకు బుద్ధి రావడం లేదని అన్నారు. గత ప్రభుత్వం కరీంనగర్‌లో చేపట్టిన అండర్ గ్రౌండ్ పనులను తామే కొలిక్కి తెచ్చామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనన్ని నిధులు కరీంనగర్‌కు ఇచ్చామని తెలిపారు. అధికార విరహవేదన మీదని…? పనుల చేయాలన్న తపన మా ప్రభుత్వానిదని అన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి మీకు కనిపించకపోతే కంటివెలుగులో చికిత్స చేయించుకోవాలని మంత్రి ఎద్దేవా చేశారు. కరీంనగర్ అభివృద్ధికి ఎంతిచ్చినా ఈ నేల రుణం తీర్చుకోలేమన్నారు. కాంగ్రెస్ గబ్బు లేపి వదిలేసిన కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలంటే కొంత టైం పడుతుందన్నారు. రెండు రోజుల రాహుల్ పర్యటనలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నాడు తప్ప, తెలంగాణకు ఏమిస్తారో చెప్పలేదని మండిపడ్డారు. కాళేశ్వరం రీడిజైన్ అంటున్న రాహుల్ మీ డిజైన్ సక్కగుంటే మేం రీడిజైన్ ఎందుకు చేసేవాళ్లమని ప్రశ్నించారు. ఒక్క రిజర్వాయర్ కూడా కట్టకుండా తుమ్మిడిహట్టి నుంచి చేవెళ్లకు నీళ్లెలా తీసుకెళ్దామనుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

ఇందిరమ్మ హయాంలో 369 మందిని చంపారని, సోనియా హయాంలో అనేక మంది యువకులు తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గన్ పార్క్ దగ్గర నివాళులర్పించడం…, హంతకులే నివాళులర్పించినట్లుంద విమర్శించారు. అమేధిలో మున్సిపాలిటీని గెలిపించలేని రాహుల్, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాడంటే ఎవరు నమ్ముతారని అన్నారు. ఎన్నికలప్పుడు 3 కోట్లతో ఉత్తమ్ అడ్డంగా దొరికిపోయింది నిజాం కాదన్నారు. ఇంది గాంధీ హయాంలో ఎమర్జెన్సీ పెట్టి మీడియా స్వేచ్ఛ గురించి రాహుల్ మాట్లాడటం సరికాదని అన్నారు. ఇవాళ శంఖుస్థాపన చేసిన పనులకు మళ్లీ మేమే అధికారంలోకి వచ్చి ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కర్ణాటకలో రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేసానని రాహుల్ చెప్పడం పూర్తి అబద్ధమని, ముఖ్యమంత్రి కుమారస్వామి ఇచ్చిన హామీ కూడా నాలుగు విడుతల్లో రుణమాఫీ చేస్తున్నారని అన్నారు.

సంక్రాంతికి గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్టు రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్ల వాలే కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల నుండి రాని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళీ రాష్ట్రానికి రావడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమవుతుందని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ అదేగతి పడుతుందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఓర్వలేక కొందరు పనికట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సిఎం కెసిఆర్‌ది అన్నారు.

Related Stories: