రాష్ట్ర సాధన తర్వాతనే అభివృద్ధి పథంలో తెలంగాణ

పల్లెలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాం పల్లె ప్రగతి ప్రస్థానంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతనే పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతి ప్రస్థానం కార్యక్రమంలో బాగంగా తిమ్మాజిపే ట మండలంలోని గుమ్మకొండ, పోతిరెడ్డి పల్లి, చేగుంట, తిమ్మాజి పేట గ్రామాలలో కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. […]

పల్లెలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తాం
పల్లె ప్రగతి ప్రస్థానంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాతనే పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం పల్లె ప్రగతి ప్రస్థానం కార్యక్రమంలో బాగంగా తిమ్మాజిపే ట మండలంలోని గుమ్మకొండ, పోతిరెడ్డి పల్లి, చేగుంట, తిమ్మాజి పేట గ్రామాలలో కార్యక్రమం రెండవ రోజు కొనసాగింది. ఈసందర్బంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అనేక అభివృద్ది పథకాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమా లు నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం ఆయా గ్రామాలలో మర్రి జనార్ధన్ రెడ్డి , కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణాలలో ఇంత అభివృద్ధి ఏప్రభుత్వ హయాంలో జరగలేదన్నా రు. సాగునీరు, త్రాగునీరు ప్రధాన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, కమ్యూనిటి భవనాల నిర్మాణాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. అన్ని వర్గాల పేద పిల్లలకు కార్పోరేట్ స్థాయిలో విద్యను అందించాలన్న లక్షంతో బీసీ రెసిడెన్షియల్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పడం జరిగిందన్నారు. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్షంతో ఆసుపత్రుల నిర్మాణం, ఆదునీకరణకు పెద్ద పీట వేయడం జరిగిందని కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకువచ్చి గర్బిణీ మహిళలకు అండగా నిలిచిందన్నారు. ఉమ్ముడి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి , కల్వకుర్తి ఎత్తి పోతల పథకాల పనులను శరవేగంగా పూర్తి చేసుకున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్ర తి మారు మూల గ్రామంలోని ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. తాను ఓట్ల కోసం పల్లె ప్రగతి ప్రస్థానం ప్రాంభించ లేదని, పల్లెల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం, అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈయాత్రను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జెడ్‌పీటీసీ కృపానందంతో పాటు, ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రేస్, తదితరు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారిని మర్రి జనార్ధన్‌రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు కండువా వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయలక్ష్మి, జెడ్‌పీటీసీ సువర్ణ, వైస్ ఎంపీపీ శ్రావణి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనువాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి, మండల పార్టీ నాయకులు రవీంద్రనాథ్‌రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, వెంకటస్వామి, ప్రదీప్, అన్వర్ ఖాన్‌లతో పాటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉప సర్పంచ్‌లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: