రాష్ట్ర సాధనలో న్యాయవాదుల త్యాగం చిరస్మరణీయం

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మన తెలంగాణ/నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో న్యాయవాదుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ కోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద న్యాయవాదుల పోరాటం చేసినారని అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారిపై అప్పటి ప్రభుత్వం […]

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

మన తెలంగాణ/నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో న్యాయవాదుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ కోర్టు బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులకు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద న్యాయవాదుల పోరాటం చేసినారని అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారిపై అప్పటి ప్రభుత్వం కేసులు పెడితే న్యాయవాదులు ఉద్యమకారుల తరపున వాదించరన్నారు. న్యాయవాదులను ప్రొత్సహం కల్పించాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా న్యాయవాదులకు రూ. 10 లక్షల ఆరోగ్య, ప్రమాద బీమా రాష్ట్రంలోని బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులుగా నమోదైన 18 వేల మందికి కల్పించామని తెలిపారు. ఈ హెల్త్ కార్డుల ద్వారా రాష్ట్రంలోని 900 ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం 100 కోట్లు డిపాజిట్ చేయడం జరిగిందన్నారు. రూ. 15 కోట్లతో జూనియర్ న్యాయవాదుల కోసం లైబ్రరీలో పుస్తకాలు కొనుగోళు, స్టయిఫండ్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. న్యాయవాదులు ఎక్కువగా ఉన్న కోర్టు లైబ్రరీలకు రూ. 5లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు నల్సార్ యూనివర్సీటిలో బ్యాచ్‌ల వారీగా 5 రోజుల పాటు శిక్షణ, శిక్షణ సమయంలో వసతితో పాటు భోజన సౌకర్యం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేసినట్లు, నిర్మల్ జిల్లాలో శ్యాంఘడ్ పక్కన రూ. 20 కోట్లతో కోర్టు భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పల గణేష్ చక్రవర్తి, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వినోద్ రావ్, ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు రాజలింగం, అడెల్లి దేశస్థానం చైర్మన్ శ్రీనివాస రెడ్డి, సీనియర్ న్యాయవాదులు విలాస్ రావ్, జగన్, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస రావ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: