రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

మన తెలంగాణ/హైదరాబాద్ సిటిబ్యూరో: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర మాదంలో దుర్మరణ చెందిన సినీ నటుడు, మాజీ ఎంపి హరికృష్ణ అంత్యక్రియ లు ముగిసాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు  ప్రభుత్వలాంఛనాల తో జూబ్లిహిల్స్ మహాప్రస్ధానంలో గురువారం సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు జరిపించారు.  హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రామ్ తండ్రి చితికి నిప్పంటించారు. ఈక్రమంలో హరికృష్ణ అంతిమయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో […]

మన తెలంగాణ/హైదరాబాద్ సిటిబ్యూరో: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర మాదంలో దుర్మరణ చెందిన సినీ నటుడు, మాజీ ఎంపి హరికృష్ణ అంత్యక్రియ లు ముగిసాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు  ప్రభుత్వలాంఛనాల తో జూబ్లిహిల్స్ మహాప్రస్ధానంలో గురువారం సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు జరిపించారు.  హరికృష్ణ కుమారుడు కళ్యాణ్‌రామ్ తండ్రి చితికి నిప్పంటించారు. ఈక్రమంలో హరికృష్ణ అంతిమయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో హరికృష్ణ ఇంటికి చేరుకుని అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
మహాప్రస్థానంలో స్మారక చిహ్నం…
హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం మహాప్రస్ధానంలో ఆయన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. అంత్యక్రియలు ముగియగానే అదికారులు హరికృష్ణ కుటుంబ సభ్యులతో చర్చించి స్మారక చిహ్నం నిర్మాణపు పనులు ప్రారంభించనున్నారు. కుటుంబ సభ్యులు హరికృష్ణ అంత్యక్రియలను మొయినాబాద్ ఫాంహౌజ్‌లో నిర్వహించాలని భావించినా ప్రభుత్వం అధికారలాంచనాలతో నిర్వహించనున్నపట్లు ప్రకటించడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.
పాడె మోసిన చంద్రబాబు, చలమేశ్వర్
గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో హరికృష్ణ నివాసం నుండి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమయింది. ఈ అంతిమయాత్రలో పాల్గొన్న ఆంద్రప్రదేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తిచలమేశ్వర్‌లు హరికృష్ణ పాడే మోసారు. ఆయన నివాం గుమ్మం నుండి వాహణం ఎక్కించే వరకు చెరోవైపు పట్టుకున్నారు.
నివాళులు అర్పించి ఏడ్చిన మంత్రిపోచారం..
తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హరికృష్ణకు నివాళులు అర్పించే సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. హరికృష్ణతో ఆయనకు ఉన్న అనుభందాన్ని గుర్తుచేసుకుని కంటతడి పెట్టారు.

Related Stories: