రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బండ శంకర్

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన బండ శంకర్‌ను నియమిస్తూ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి నాయకత్వంలో 1987లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ శంకర్ ఎన్‌ఎస్‌యు పట్టణ అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, నియోజకవర్గ ఇంచార్జిగా, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు. […]


జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జగిత్యాల పట్టణానికి చెందిన బండ శంకర్‌ను నియమిస్తూ టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి నాయకత్వంలో 1987లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ శంకర్ ఎన్‌ఎస్‌యు పట్టణ అధ్యక్షుడిగా, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, నియోజకవర్గ ఇంచార్జిగా, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు. శంకర్ సేవలను గుర్తించిన టిపిసిసి అతడిని రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా బండ శంకర్ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అప్పగించిన బాధ్యలను పూర్తి స్థాయిలో నెరవేర్చుతానని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Stories: