రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహిద్దాం

మన తెలంగాణ/వనపర్తి: నేడు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య జిల్లా అధికారులతో కోరారు. గురువారం ఆయన జిల్లా అధికారులతో కలిసి రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదిక, షామియానా, స్టాల్స్‌నిర్వహణ, తాగునీరు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చూసుకోవాలని కోరారు. రాష్ట్రఅవతరణ […]

మన తెలంగాణ/వనపర్తి: నేడు రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పా ట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ పి.చంద్రయ్య జిల్లా అధికారులతో కోరారు. గురువారం ఆయన జిల్లా అధికారులతో కలిసి రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదిక, షామియానా, స్టాల్స్‌నిర్వహణ, తాగునీరు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు చూసుకోవాలని కోరారు. రాష్ట్రఅవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించే పలు సాంస్కృతిక కార్య క్రమాలు సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని ఆయన కోరారు. అనంతరం డిఈఒ సుశీందర్‌రావు, డిపిఆర్‌ఒ వెంకటేశ్వర్లుతో కలసి శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆయన వెంట డిఆర్‌డిఒ గణేష్, డిఈఒ సుశీందర్‌రావు , డిపిఆర్‌ఒ వెంకటేశ్వ ర్లు, ఆర్డీఒ చంద్రారెడ్డి, ఉధ్యానశాఖ ఎడి విజయ్‌భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ రాజేందర్ గౌడ్, ఆర్‌ఆండ్‌బి ఇంజనీర్లు విజయ్, మురళి, తదితరులు ఉన్నారు.
మల్దకల్‌లో.. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు గాను అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయా పాఠశాలల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే కార్యాలయాలు, ఇతర ప్రైవేటు కార్యాలయాలల్లో కూడా ఘనంగా జరపనున్నారు. అలాగే మహాత్మాగాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేయడం జరుగుతుంది. గద్వాలలో జరిగే అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. పాఠశాలల్లో సాంసృ్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మల్దకల్‌లో జరిగే ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు.
వనపర్తి కలెక్టరేట్‌లో.. వనపర్తి పట్టణ కేంద్రంలోని నిరంజన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, పలు సంక్షేమ పథకాలు, గత నాల్గు సంవత్సరాలుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన పనులపై కార్యకర్త లకు అవగా హన కల్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు మండలాలు, గ్రామాల పలు సంఘాలు,ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయా లని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి. లక్ష్మయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ ఎత్తం రవికుమార్,కౌన్సిలర్లు లోక్‌నాథ్‌రెడ్డి, భువనేశ్వరి, పిడి. కమలమ్మ, ప్రమీ లమ్మ, ఇందిరమ్మ, గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, రాములు యాదవ్, నందిమల్ల శ్యాం, పిడి.జయానందం, అజీజ్‌ఖాన్,గులాంఖాదర్, టిఆర్‌ఎస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు .

Comments

comments

Related Stories: