రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

చేయాలని అలాగే ఇతర శాఖలు కూడా వారి స్టాల్స్ ఏర్పాటు చేయాలని , అవా ర్డుల ఎంపిక, అవార్డు కమిటీలు, ఆయా శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎంపిక చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముఖ్య అతిథి సందేశం , పాఠశాలల విద్యార్థుల ఉపన్యాసపోటీలు,డ్రాయింగ్, పెయింటింగ్, తెలంగాణ వేడుక లను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జెసి.పి.చంద్రయ్య, ట్రైనీ ఐఎఎస్ సంతోష్, డిపిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, దీనికి సంబంధించి చేపట్టవల్సిన చర్యలను సమీక్షించడానికి రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్ టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు కలెక్టర్లకు శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జూన్ 2న జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. అమర వీరుల స్థూపాలనికి మంత్రులు, కలెక్టర్లు,అధికారులు నివాళులు అర్పించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని, ఆసుపత్రుల్లో అనాథ శరణాలయాలల్లో వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టాలని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వీడియో కాన్పరెన్స్‌కు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

వీసిలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.చందులాల్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ /వనపర్తి ప్రతినిధి: గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.చందులాల్ అన్నారు. రాష్ట్రావరతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం హైద్రాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. ములుగు నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని , గ్రామస్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలల్లో వేడుకలు నిర్వహించాలని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయ వంతంచేయాలని కోరారు.రాష్ట్ర సాంకేతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలని ,అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని, జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్ర మాల నిర్వహణ, కళాకారులతో ర్యాలీ, కవి సమ్మేళనం, ఈ సంవత్సరం అన్ని పాఠశాలల్లో ప్రభాత్ భేరి, జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ శ్వేతామ హంతి జిల్లా అధికారులతో మాట్లాడుతూ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా తెలంగాణ అంశం ప్రస్పుటించేలా తంగేడు, జమ్మి మొక్కలతో హరిత హారం స్టాల్ ఏర్పాటు చేయాలని అలాగే ఇతర శాఖలు కూడా వారి స్టాల్స్ ఏర్పాటు చేయాలని , అవార్డుల ఎంపిక, అవార్డు కమిటీలు, ఆయా శాఖల ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఎంపిక చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ముఖ్య అతిథి సందేశం , పాఠశాలల విద్యార్థుల ఉపన్యాసపోటీలు,డ్రాయింగ్, పెయింటింగ్, తెలంగాణ వేడుక లను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్వేతా మహంతి కోరారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జెసి.పి.చంద్రయ్య, ట్రైనీ ఐఎఎస్ సంతోష్, డిపిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌లో: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, దీనికి సంబంధించి చేపట్టవల్సిన చర్యలను సమీక్షించడానికి రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి చందులాల్ టూరిజం సెక్రటరీ బుర్ర వెంకటేశం, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు కలెక్టర్లకు శుక్రవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను జూన్ 2న జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. అమర వీరుల స్థూపాలనికి మంత్రులు, కలెక్టర్లు,అధికారులు నివాళులు అర్పించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలు చేయాలని, ఆసుపత్రుల్లో అనాథ శరణాలయాలల్లో వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠాయిలు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టాలని కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. వీడియో కాన్పరెన్స్‌కు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments