రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం: సిఎం కెసిఆర్

  హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యచరణ, నూతన మున్సిపాలిటి చట్టం రూపకల్పనపై సిఎం కెసిఆర్ సమీక్షించారు. పాల్గొన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎ ఆరూరి రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ఈ కార్యక్రమంలో పాల్పొన్నారు. గ్రామాలు, పట్టణాల […] The post రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు తెస్తున్న నూతన పంచాయితీరాజ్ చట్టం అమలు కోసం కార్యచరణ, నూతన మున్సిపాలిటి చట్టం రూపకల్పనపై సిఎం కెసిఆర్ సమీక్షించారు. పాల్గొన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్ సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎ ఆరూరి రమేశ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు ఈ కార్యక్రమంలో పాల్పొన్నారు. గ్రామాలు, పట్టణాల గుణాత్మక అభివృద్ధిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల పటిష్ట అమలు కీలకమని సిఎం అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం చట్టాలను సవరించి, మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా గ్రామాల్లో మున్సిపాలిటీ స్థాయిలో సుపరిపాలన అందించగలుగుతామని కెసిఆర్ తెలిపారు.

పంచాయతీరాజ్ చట్టాన్ని పటిష్టంగా రూపొందించిన పద్దతిలోనే మున్సిపల్ చట్టం రూపకల్పన చేయాలి. అవినీతి రహితంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టం రూపొందించాలని, నూతన పంచాయతీరాజ్ చట్టానికి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మనుసు పెట్టి పని చేస్తే గ్రామలు, మున్సిపాలిటీల స్థాయిలో కావాల్సినంత పని వున్నది, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ పని వదిలి ఇంకెక్కడో ఉన్నట్టు నేల విడిచి సాము చేయొద్దు, విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఇతర మౌలిక రంగాల అభివృద్ధి బాధ్యత అధికారులదే అని, మున్సిపాలిటీలు దినదినాభివృద్ధి చెందుతున్నాదని, ప్రజలకు మేలైన పాలన అందించాల్సిన విషయాన్ని గమనించాలన్నారు. చట్టం అమలు విషయంలో ప్రభుత్వ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా బాధ్యులను చేస్తూ పకడ్బందీగా మున్సిపల్ చట్టాన్ని ఎంత మెరుగ్గా రూపొందించగలిగితే ప్రజలకు అంత గొప్పగా సేవలందించగలుతామన్నారు.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ  మేడిగడ్డ బ్యారేజి దగ్గర మహారాష్ట్ర వైపు బండ్, కరకట్టల నిర్మాణానికి అవసరమైన 10 హెక్టార్ట అటవీ భూమికి అనుమతి మంజూరు చేసింది. నెల క్రితమే మొదటి దశకు అనుమతి, తాజాగా రెండో దశకు అనుమతులు లభించాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా మరో 10 హెక్టార్లలో అటవీ అభివృద్ధికి అవసరమైన నిధులను ఇప్పటికే కేటాయించింది.

 

The post రాష్ట్రంలో పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: