రామలక్ష్మి ఆరేషన్ కోసం దాతలు సహకరించాలి…

The donors must cooperate for the Ramalakshmi operation
బెజ్జూర్: బెజ్జూర్ మండల కేంద్రంలోని రామలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుందని ఆదుకోవాలని ఆమె భర్త నరేందర్ (నరేష్) కోరుతున్నాడు. ఇరువురు భార్య భర్తలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల నుండి ఎలాంటి ఆధారం లేకున్నా అన్యోన్యంగా ఉంటున్న వీరిపై విధి కన్నెర్ర చేసింది. అది రామలక్ష్మికి అంతుచిక్కని వ్యాధి రూపంలో వచ్చింది. రోజు రోజుకు క్షిణిస్తున్న రామలక్ష్మిని చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లామని, కానీ ప్రయోజనం శూన్యం. చివరికి చెన్నై ఆసుపత్రికి వెళ్లగా ఇది లక్షల్లో ఒకరికి వచ్చే తకాయతు ఆర్థిటిక్ టైప్ 5 గా గుర్తించారు. వ్యాధికి అత్యంత ఖర్చుతో కూడుకున్నది. సుమారుగా రూ. 18 లక్షల వరకు ఖర్చు అవుతుందని నెల రోజుల్లోగా ఆపరేషన్ చేయాలని పిడుగులాంటి వార్తను నరేందర్‌కు చెప్పడంతో దిక్కుతోచని స్థితి. అప్పటికే ఉన్న డబ్బు ఖర్చు చేసి చివరికి ఇల్లు కూడా అమ్మేసిన నరేందర్‌కు ఏం చేయలేని నిస్సాహయ స్థితి. చాలా మందిని కలిసినప్పటికి ఎవరి నుండి స్పష్టమైన హామీ రాలేదు. ఒక స్వచ్చంద సంస్థ ద్వారా గురువారం వరకు సుమారుగా రూ. 1,31,150 సేకరించారు. సన్నిహితులు, మిత్రుల ద్వారా మరికొంత డబ్బు సేకరించారు. కానీ అది వైద్యానికి సరిపోదు. దాతలు ఎవరైనా పెద్ద మొత్తంలో సాయం చేస్తే తప్పా రామలక్ష్మి జివితాన్ని కాపాడలేని పరిస్థితి. రామలక్ష్మికి మనోధైర్యాన్ని కల్పిస్తు మనం చేయగల్గింది ఒక్కటే. రామలక్ష్మి ఆపరేషన్ కోసం ఇక మిగిలింది 15 రోజులు మాత్రమే. రామలక్ష్మిని కాపాడే ందుకు ప్రతీ ఒక్కరి సహాయం ఎదురుచూస్తున్నాం…

Comments

comments