రామగుండం మేయర్ పై అవిశ్వాసం..

పెద్దపల్లి: రామగుండం మున్సిపాల్ కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ మరియు డిప్యూటి మేయరు పై 39 మంది కార్పొరేటర్లు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అవిశ్వాస తీర్మాణ పత్రం అందించారు. మొత్తం 50 మంది కార్పోరేటర్లు ఉండగా ఇందులో టిఆర్‌యస్ పార్టీకి చెందిన 28 మంది కార్పోరేటర్లు, 10 మంది కాంగ్రెస్, 1 బిజెపికి చెందిన కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌యస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ సత్యప్రకాష్ ,కాంగ్రెస్ కు […]

పెద్దపల్లి: రామగుండం మున్సిపాల్ కార్పొరేషన్ మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ మరియు డిప్యూటి మేయరు పై 39 మంది కార్పొరేటర్లు శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు అవిశ్వాస తీర్మాణ పత్రం అందించారు. మొత్తం 50 మంది కార్పోరేటర్లు ఉండగా ఇందులో టిఆర్‌యస్ పార్టీకి చెందిన 28 మంది కార్పోరేటర్లు, 10 మంది కాంగ్రెస్, 1 బిజెపికి చెందిన కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌యస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ సత్యప్రకాష్ ,కాంగ్రెస్ కు చెందిన మహంకాళి స్వామిలు మాట్లాడుతూ రామగుండం నగరాన్ని అభివృద్ది చేయడానికి ఎన్ని వనరులు ఉన్నకాని, రామగుండం అభివృద్దికి ఆమడ దూరంలో ఉందని, ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రజల సమస్యలు ప్రస్తవించి అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి, వాటి పరిష్కరించడానికి వేధికగా ఉపయోగడే సాధారణ సమావేశాలు 4 సంవత్సరాలలో కేవలం 3 సమావేశాలు నిర్వహించడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలిపారు. స్టాండింగ్ కమిటిని తన స్వార్థం కోసం వాడుకున్నారని, కమిటిలో తీసుకున్న నిర్ణయాలను గుట్టుగా ఉంచి, కార్పోరేటర్లకు తెలపలేదన్నారు. జనరల్ ఫండ్స్, నాన్ ప్లాన్ ఫండ్స్ నిధులను తప్పనిసరి అవసరం ఉన్న చోట మాత్రమే అభివృద్దికి ఖర్చు చేయవలసి ఉండగా దానికి విరుద్దంగా కమీషన్లు తీసుకొని ఫండ్స్‌ను దుర్వినియోగం చేశారని తెలిపారు. గతంలో 24 గంటలు రామగుండంలో మంచినీటి సరఫరా జరిగిందని, కాని ఇప్పుడు వారానికి 3 రోజులు మాత్రమే సరఫరా చేస్తున్నారన్నారు. భావన నిర్మాణ అనుమతులలో అవకతవకలు జరిగాయని, ఇష్టం వచ్చినట్టు అనుమతులు ఇచ్చారని, ప్రభుత్వ భూముల్లో కూడ చట్టానికి విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారని విమర్శించారు. రెవెన్యూ విభాగంలో విరుద్ధంగా నిర్మించిన ఇండ్లకు ఇంటి నంబరు ఇచ్చారని, అక్రమాలకు పాల్పడిన మేయరు నుండి ఎప్పుడు విముక్తి కల్గుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారని వారి అభిష్టం మేరకు అవిశ్వాసం పెట్టామని వారు తెలిపారు.

Comments

comments

Related Stories: