సిద్దిపేట : ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్నేహితుని పెళ్లి కోసం అద్దె కారులో ఆదివారం మంచిర్యాలకు వచ్చారు. పెళ్లి పూర్తి అయిన తరువాత వారు సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్కు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రజ్ఞాపూర్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొని బొల్లా పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.