రాజకీయ వేడి

ప్రగతి నివేదన సభ తరువాత చకచకా పరిణామాలు నేడో, రేపో కీలక కేబినెట్ సమావేశం గవర్నర్‌ను కలిసిన సిఎస్, ముఖ్య సలహాదారు, సిఎంఒ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రధాన కార్యదర్శితో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భేటీ జాయింట్, అదనపు, డిప్యూటీ సిఇఒ అధికారుల నియామకంపై చర్చ ఈ నెల 8 నుంచి ఇరవై రోజుల పాటు సెలవులో సిఇఒ రజత్‌కుమార్ నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై సమావేశం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ […]

ప్రగతి నివేదన సభ తరువాత చకచకా పరిణామాలు

నేడో, రేపో కీలక కేబినెట్ సమావేశం
గవర్నర్‌ను కలిసిన సిఎస్, ముఖ్య సలహాదారు, సిఎంఒ ప్రిన్సిపల్ సెక్రెటరీ
ప్రధాన కార్యదర్శితో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భేటీ
జాయింట్, అదనపు, డిప్యూటీ సిఇఒ అధికారుల నియామకంపై చర్చ
ఈ నెల 8 నుంచి ఇరవై రోజుల పాటు సెలవులో సిఇఒ రజత్‌కుమార్
నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై సమావేశం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి కొంగరకలాన్‌లో ఈ నెల 2వ తేదీన నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సభ తర్వాత విపక్షాలు పలు విమర్శలు చేయగా అధికార పార్టీ దీటైన సమాధానం ఇచ్చింది. వీటికి కొనసాగింపుగా ప్రధాన కార్యదర్శి, ముఖ్య సలహాదారు, సిఎంఒ ముఖ్య కార్యదర్శి తదితరులు రాజ్‌భవన్ వెళ్ళి మంగళవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం లేదా గురువారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటి కే సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ఎజెండాకు సంబంధించిన విషయాలను సిద్ధం చేయగా, పలు కీలకమైన అంశాలపైనా చర్చ జరిగే అవకా శం ఉన్నట్లు తెలిసింది. పరిపాలనకు సంబంధించినవి మాత్రమే కాకుండా శాసన వ్యవహారాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశం లో చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నా యి. గవర్నర్ నరసింహన్‌తోనూ కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ నెల 7వ తేదీన భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సచివాలయంలో ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో సమావేశం కావడం, అసెంబ్లీ కార్యదర్శితో సైతం సిఎం పలు విషయాలపై చర్చించడం సచివాలయంలో ఎన్న డూ లేని కొత్త వాతావరణానికి కారణమయ్యా యి. బుధవారం సాయంత్రం లేదా గురువారం ఉదయం ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుందని, ఇందులో కీలక అంశాలపైనే చర్చ ఉంటుందని, ఉద్యోగుల ఐఆర్ (మధ్యంతర భృతి)తో పాటు శాసన వ్యవహారాలకు సంబంధించిన అంశంపై కూడా చర్చ ల అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలపనున్న ట్లు తెలిసింది. వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన పెండింగ్ ఫైళ్ళతో సిఎస్ పేషీకి రావడంతో సందడి వాతావరణం నెలకొనింది. మరోవైపు బుధవారం సాయంత్రంకల్లా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సిఎం సమావేశమై ఐఆర్ విషయంలో అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉంది.
సిఎస్‌తో ఎన్నికల ప్రధానాధికారి భేటీ
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఓ) కార్యాలయానికి అదనంగా సిబ్బందిని కేటాయించడానికి ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సానుకూలంగా స్పందించారు. సిఇఓ కార్యాలయంలో గత కొంతకాలంగా సిబ్బంది కొరత ఉండడంతో అదనపు సిబ్బందిని సమకూర్చాల్సిందిగా ప్రభుత్వానికి కొన్ని నెలల క్రితమే విజ్ఞప్తులు అందాయి. అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండడం, ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల తదితర పరిణామాల నేపథ్యంలో తక్షణం అదనపు సిబ్బంది అవసరం కావడంతో ప్రధాన కార్యదర్శితో సిఇఓ రజత్‌కుమార్ మంగళవారం మధ్యా హ్నం భేటీ అయ్యి చర్చించారు. ఒక అదనపు సిఇఓ, ఒక జాయిం ట్ సిఇఓ, ఒక డిప్యూటీ సిఇఓ తదితర ఉన్నత పోస్టులతో పాటు సహాయ సిఇఓ, సెక్షన్ ఆఫీసర్లు, సహాయ సెక్షన్ ఆఫీసర్లు తదితర 13 పోస్టుల్లో సిబ్బందిని సమకూర్చడానికి సిఎస్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు సమాచారం. అయితే కొన్ని ఉన్నత పోస్టులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి శాఖాపరమైన ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసినందున దానిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సిఇఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సెలవుపై వెళ్తున్నందున ఆ స్థానంలో డిప్యూటీ సిఇఓ బాధ్యతలు (ఇన్‌ఛార్జిగా) స్వీకరించే అవకాశం ఉంది. సిఎస్‌తో భేటీ అనంతరం రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం మాత్రమే రాష్ట్ర సిఇఓ కార్యాలయం చూస్తుందని, నిర్ణయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరే జరుగుతాయన్నారు. ఎన్నికలు అనివార్యమైతే ఏ విధంగా వ్యవహరించాలన్నదానిపై కూడా కేంద్ర సంఘం నుంచే స్పష్టమైన ఆదేశాలు వస్తాయని, ఇవిఎంలతో పాటు వివిపిఏటి యంత్రాలను కూడా సమకూరుస్తుందని తెలిపారు. వివిపిఏటి వినియోగంపై జాయింట్ కలెక్టర్ల మొదలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే సిబ్బంది వరకు శిక్షణ జరుగుతూ ఉందని, కేంద్రం నుంచి నిపుణులు కూడా వచ్చారని తెలిపారు. గతంలో ఎలక్టోరల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే విధానం ఉండేదని, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఇఆర్‌ఓ నెట్ అనే నూతన వ్యవస్థను వినియోగంలోకి తీసుకొచ్చిందని, దేశమంతటికీ వర్తించే ఈ విధానంపై ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితాను రూపొందించామని, దీనిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు అన్ని సెక్షన్ల ప్రజల నుంచి వచ్చే నెల చివరి వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.

Comments

comments

Related Stories: