రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’

Srikanth

శ్రీకాంత్ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్ 2019’. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్, సునీల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఈనెలాఖరున విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సెన్సార్ పూర్తికాగానే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా ర్యాప్‌రాక్ షకీల్ స్వరపరిచిన ఓ పాటను సునీల్‌పై తెరకెక్కిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సందర్భంగా లొకేషన్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ “రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’ సినిమా చేస్తున్నాను. చాలా డిఫరెంట్‌గా, కొత్త గా ఈ చిత్రం ఉంటుంది. ‘ఆపరేషన్ దుర్యోధన’ తర్వాత మళ్లీ కొత్త గెటప్‌తో ఈ సినిమా చేశాను. ప్రేక్షకులు ఆలోచించే విధంగా కరణం బాబ్జి డైలాగులు బాగా రాశాడు. ఇందులో మంచు మనోజ్, సునీల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంది”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ ‘శ్రీకాంత్ అన్నయ్య నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన’ నా ఫేవరేట్ సినిమా. ఇప్పుడు అయనతో ‘ఆపరేషన్ 2019’ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నాను”అని తెలిపారు. దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “శ్రీకాంత్‌తో నాకిది రెండో సిని మా. చెన్నైలో జరిగిన ఒక ఘటన ఆధారంగా నేను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. మనోజ్ పాత్ర ‘పెదరాయుడు’లో రజనీకాంత్ పాత్రలా ఉంటుంది”అని పేర్కొన్నారు. యజ్ఞ శెట్టి, దీక్షా పంత్, హరితేజ, సుమన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరాః వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్‌ః ఎస్.బి.ఉద్ధవ్.