రాజకీయ ఆయుధానికి బలైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ : రాహుల్ గాంధీ

Rahul Gandhi Speech Against BJP Party

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానం పై లోక్ సభలో నడుస్తోన్న చర్చలో భాగంగా కేంద్ర ఫ్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ మీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఆగ్రహించిన బిజెపి  రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టే యోచనలో ఉంది. రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేసి పార్లమెంట్ ను పక్కదారి పట్టిస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ అన్నారు. బిజెపి ఎంపీలు రాహుల్ గాంధీ మీద తీర్మానం తీసుకురానున్నట్టు సమాచారం. 21వ శతాబ్దంలో రాజకీయ ఆయుధానికి బలైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని  తన ప్రసంగంతో ప్రారంభించిన రాహుల్ మోదీ తీరు పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.

Comments

comments