రాజకీయతో వేడెక్కిన రామగుండం…

పెద్దపల్లి: గత రెండు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడితే రామగుండంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన ఆదిపత్య పోరు చిలికి చిలికి గాలివానగా మారి సొంత పార్టీ పైనే అవిశ్వాస తీర్మానం వరకు వెళ్లింది. కొంకటి లక్ష్మినారాయణ మేయర్‌గా ఎన్నికయిన తరువాత రామగుండం అభివృద్ది కుంటుబడిందని, తెలంగాణ ప్రభుత్వం నగర అభివృద్దికి 200 కోట్లిస్తే ఈ నాలుగేళ్లలో కేవలం 18 కోట్లు మాత్రమే […]

పెద్దపల్లి: గత రెండు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడితే రామగుండంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య తలెత్తిన ఆదిపత్య పోరు చిలికి చిలికి గాలివానగా మారి సొంత పార్టీ పైనే అవిశ్వాస తీర్మానం వరకు వెళ్లింది. కొంకటి లక్ష్మినారాయణ మేయర్‌గా ఎన్నికయిన తరువాత రామగుండం అభివృద్ది కుంటుబడిందని, తెలంగాణ ప్రభుత్వం నగర అభివృద్దికి 200 కోట్లిస్తే ఈ నాలుగేళ్లలో కేవలం 18 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడని, పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గంలో వర్గాలు సృష్టించి గందర గోళ పరిస్థితులు నెలకొల్పాడని సోమారపు సత్యనారాయణ పలుమార్లు పార్టీ ఆదిష్టానానికి ఫిర్యాదు చేయగా, ఎంఎల్ఎ నగర అభివృద్దికి ఆటకంగా మారాడని కార్పొరేషన్‌కు చెందిన ప్రతి పనిలో కలుగజేసుకుంటున్నాడని కొంకటి బహిరంగంగా ఆరోపించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజక వర్గాలలో నేతల మధ్య వివాదాలు పార్టీకి నష్టం చేస్తాయని అంచనాకు వచ్చిన అదిష్టానం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గ్రూపులు కడుతున్న మున్పిపల్ చైర్మెన్లు, మేయర్లను అవిశ్వాస తీర్మాణం ద్వారా తొలగించాలని తీసుకున్న నిర్ణయం మేరకే సొమారం పావులు కదిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంకటిని మేయర్ పదవి నుండి తొలగించేందుకు ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, బిజేపి కార్పొరేటర్లను కలుపుకొని శుక్రవారం 39 మందితో అవిశ్వాస తీర్మాణం పై సంతకాలు చేయించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంలో ఎంఎల్ఎ సఫలం అయ్యాడు. అవిశ్వాస తీర్మాణం పై కలెక్టర్ నిర్ణయం తీసుకునే వరకు కార్పొరేటర్లు జారిపోకుండా ఉండేందుకు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కొంకటి వర్గియులుగా ఉన్న కార్పొరేటర్లైన రజిత రాజు, బద్రి, దాసరి ఉమాదేవి సాంబమూర్తి, నసీమా బేగంలను గతంలో పార్టీ నుండి బహిష్కరించిన ఎంఎల్ఎ తిరిగి వారిని శనివారం పార్టీలోకి తీసుకున్నారు. రాబోయ్యే కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇప్పుడున్న వారికి ఖచ్చితంగా టికెట్లు ఇస్తానని హమి ఇవ్వడంతో ఎంఎల్ఎ మంత్రాంగం ఫలించింది. ఫలితంగా రామగుండం కార్పొరేషన్‌లోని 50 మంది కార్పొరేటర్లకు గాను, 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మాణం తేది ఎప్పుడు ఖరారయిన నెగ్గడం లాంచనమేనని భావిస్తున్నారు.

రాజీనామ యోచనలో కొంకటి:
టిఆర్‌ఎస్ పార్టీ అదిష్టానం సానుకూలంగా స్పందించకుంటే మేయర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కొంకటి లక్ష్మిరాయణ సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ అదిష్టానానికి వాస్తవ పరిస్థితులు తెలిపి గండం నుండి గట్టేక్కేందుకు శుక్రవారమే పట్నం బాట పట్టిన కొంకటికి ఎలాంటి హమి లభించలేదని తెలుస్తోంది. రాజీనామా చేయడం ఖరారయినప్పటికి కలెక్టర్ అవిశ్వాస తీర్మాణానికి తేది నిర్ణయించిన తరువాత చేయాలా, ముందే చేయాలా అనే డైలామాలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Stories: