రాచకొండలో…వెక్కిరిస్తున్న ఖాళీలు

మంజూరైన పోస్టులు 6906 పనిచేస్తున్న అధికారులు 3787 భర్తీచేయాల్సిన ఖాళీలు 3119 6 నెలల్లో నమోదైన కేసులు 1,241 విస్తీర్ణం 5091 చ.కి.మీ.లు, 39 రెవెన్యూ మండలాలు మన తెలంగాణ/ సిటీబ్యూరో : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిస్థితి. నేరాల నియంత్రణలో తనదైన కృషి చేస్తున్న కమిషనరేట్ పోస్టుల ఖాళీలతో సతమతమవుతోంది. విస్తీర్ణం పరం గా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాచకొండ పోలీ సు కమిషనరేట్‌లో […]

మంజూరైన పోస్టులు 6906
పనిచేస్తున్న అధికారులు 3787
భర్తీచేయాల్సిన ఖాళీలు 3119
6 నెలల్లో నమోదైన కేసులు 1,241
విస్తీర్ణం 5091 చ.కి.మీ.లు, 39 రెవెన్యూ మండలాలు

మన తెలంగాణ/ సిటీబ్యూరో : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిస్థితి. నేరాల నియంత్రణలో తనదైన కృషి చేస్తున్న కమిషనరేట్ పోస్టుల ఖాళీలతో సతమతమవుతోంది. విస్తీర్ణం పరం గా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాచకొండ పోలీ సు కమిషనరేట్‌లో సగం వరకు పోస్టులు ఖాళీగా ఉండటం తో పనిభారం తడిసి మోపెడవుతోంది. పర్యవేక్షణ, నిఘా ను పటిష్టం చేయడం క్లిష్టతరంగా మారుతోంది. నమోదైన కేసుల ఛేధనలో మొత్తం 50 శాతానికే పరిమితమైనా సంచలనం కలిగించిన కేసులను వేగంగా ఛేధిస్తున్నది. గత ఏడదితో పోల్చితే ఈ ఏడు కేసులను 50 శాతానికి తగ్గించడ ంలో సఫలీకృతమైనట్టు అధికారులు వివరిస్తున్నారు. కమిషనరేట్‌కు మంజూరైన పోస్టుల మేరకు భర్తీచేస్తే మరింత సమర్థవంతంగా పనిచేసి నేరాల నియంత్రణ చేసేవీలుంటుందనేది అధికారుల అభిప్రాయం. ప్రస్తుతం సగం అధికారులు, సిబ్బందితోనే శాంతిభద్రతలు కాపాడటంలో, నేరాలను తగ్గించడంలో ఆశించిన మేర ఫలితాలను సాధిస్తుందని అధికారులు వివరిస్తున్నారు.

 ఇదీ కమీషనరేట్

5091 చ.కి.మీ.లు వస్తీర్ణం. 39 రెవెన్యూ మండలాలు. 42 లక్షల జనాభ. 3 శాంతిభద్రతల జోన్‌లు. 8 డివిజన్‌లు. 46 పోలీసు స్టేషన్‌లు. 3 ట్రాఫిక్ డివిజన్‌లు, 7 ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు. 3 సిసిఎస్, 2 మహిళా పోలీసు స్టేషన్లు.

 నేరాలు గత ఆరు నెలల్లో

2017 జూన్ 2018 జూన్ వరకు మొత్తం కేసులు 20, 817గా నమోదయ్యాయి. ఇందులో 4,243 ఆర్థికపరమైన కేసులుగా ఉన్నా యి. అయితే, వీటిని ఛేధించేందుకు రాచకొండ పో లీసు కమిషనరేట్ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నప్పటికీ విస్తీ ర్ణం చాలా అధికంగా ఉండటంతో నేరాల నియంత్రణ, ఛేధనలో వెనుకబడుతోందనేది రికార్డులు వెల్లడిస్తున్నవి. గత ఆ రు మాసాల్లో 1,241 నేరాలు నమోదు కాగా అందులో మొత్తం 626 కేసులు మాత్రమే ఛేధించినట్టు వెల్లడిస్తున్నారు. ఇందులో దొంగతనాలు 809 కాగా, కేవలం 401కేసులు మాత్రమే ఛేధించడం జరిగింది. దోపిడీలు 27 జరిగితే 17 మాత్రమే పట్టుకోగలిగారు. స్నాచింగ్ లు 34 కాగా, 11 కేసులను ఛేధించారు. అయితే, సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం కొంత వెలితిగా ఉన్నది.

 ఖాళీ పోస్టులు 3119లు..

జిఓ ఎంఎస్ నెం. 126 హోం( లీగల్) విభాగం జారీచేయడంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ ఏర్పడింది. కమిషనరేట్‌కు మొత్తం పోస్టులు 6906 మంజూరయ్యాయి. అయితే, ప్రస్తుతం పనిచేస్తున్నది మాత్రం 3787లు, ఖాళీగా 3119లు ఉన్నాయి. ప్రస్తుతం నగర శివారులో ఇంటివి, సాధారణ దొంగతనాలు అధికంగా నమోదవుతున్నాయి. వీటితో పాటు సైబర్, మహిళా నేరాలు పెరుగుతున్నాయి. ఈ నే పథ్యంలోనే కమిషనరేట్ ను మరింత బలోపేతం చే యాల్సిన అవసరమున్నదనేది అధికారుల అభిప్రాయ ం. కమిషనరేట్ పరిధిలో అధికశాతం పలు బహుళజాతి కం పనీలు, జాతీయ సంస్థలు, అ దిభట్ల, ఉప్పల్, పోచారం, బీబీనగర్ ప్రాంతాల్లోని పరిశ్రమలున్నాయి. ఇసిఐఎల్, ఎన్‌ఎఫ్‌సి, జెన్‌పాక్, హెచ్‌ఎంటి, కోకాకోల, విటల్ ఇన్‌స్టాలేషన్స్, చర్లపల్లి జైలు, మింట్, రామోజీ ఫిల్మ్‌సిటీ వంటివి ఉన్నాయి. కమిషనరేట్‌లోని పోస్టులు భర్తీ చేయడంతో పాటు మరింత సాంకేతిక పరిజ్ఞానంను సమకూర్చాల్సిన అవసరమున్నదనేది కమిషనరేట్ అధికార యంత్రాంగం అభిప్రాయం.

Related Stories: