రహదారుల ఆక్రమణలతో అవస్థలు

కోడేరు: మండల కేంద్రంలో రహదారుల ఆక్రమణలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే స్థానిక బస్టాండ్ కూడళిలో రోడ్డుకు ఇరు వైపుల ఉన్న దుఖానం దారులు రోడ్ల పైకి రావడంతో రహదారిపై ఒకే సారి వెళ్లాల్సి వచ్చిన బస్సులు, ఇతర వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నుంచి నాగర్‌కర్నూల్ వెళ్లే రహదారిపై దుఖానాల ముందు వాహనాలు రోడ్లపై ఆపుతున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం బస్టాండ్ వద్ద ఆర్టీసి బస్సు, పాఠశాల […]


కోడేరు: మండల కేంద్రంలో రహదారుల ఆక్రమణలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే స్థానిక బస్టాండ్ కూడళిలో రోడ్డుకు ఇరు వైపుల ఉన్న దుఖానం దారులు రోడ్ల పైకి రావడంతో రహదారిపై ఒకే సారి వెళ్లాల్సి వచ్చిన బస్సులు, ఇతర వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నుంచి నాగర్‌కర్నూల్ వెళ్లే రహదారిపై దుఖానాల ముందు వాహనాలు రోడ్లపై ఆపుతున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం బస్టాండ్ వద్ద ఆర్టీసి బస్సు, పాఠశాల బస్సు ఒకే సారి ఎదురు పడడం, రోడ్డుకు ఇరు వైపుల వాహనాలు నిలపడంతో ఇబ్బందులు పడ్డారు. పోలీస్ అధికారులు నిత్యం అటుగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. అసలే చిన్నపాటి చినుకులకే రోడ్లు బురదమయంగా మారి నడవటానికే రాని పరిస్థితి ఎర్పడుతుంది. అసలే రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు రోడ్ల ఆక్రమణలు, వాహనాల పార్కింగ్‌లతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించి, అక్రమ పార్కింగ్‌లు చేయకుండా చూడాలని గ్రామస్థులు, వాహనదారులు కొరుతున్నారు.

Comments

comments