రహదారిపై ఆటో బోల్తా…

బోధన్‌ అర్బన్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుండి సోమవారం ఉదయం బోధన్‌ వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ సాయిలు(23) తోపాటు నలుగురికి గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్ధులకు స్వల్పగాయాలు కావడంతో వీరిని అంబులెన్స్‌లో బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఆయా గ్రామాలకు చెందిన వారితో పాటు విద్యార్ధులు బోధన్‌కు వస్తున్నారు. కాగా ఆర్ టిసి బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్ధులు చదువుకోవడానికి తమతమ పాఠశాలలకు వెళ్ళడానికి ఆటోలో ప్రయాణం […]

బోధన్‌ అర్బన్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుండి సోమవారం ఉదయం బోధన్‌ వైపు వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ సాయిలు(23) తోపాటు నలుగురికి గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్ధులకు స్వల్పగాయాలు కావడంతో వీరిని అంబులెన్స్‌లో బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ఆయా గ్రామాలకు చెందిన వారితో పాటు విద్యార్ధులు బోధన్‌కు వస్తున్నారు. కాగా ఆర్ టిసి బస్సులు సమయపాలన పాటించకపోవడంతో విద్యార్ధులు చదువుకోవడానికి తమతమ పాఠశాలలకు వెళ్ళడానికి ఆటోలో ప్రయాణం చేస్తు ఆటో బోల్తా పడడంతో గాయాలపాలయ్యారు. దీంతో సమయపాలన పాటించని  ఆర్ టిసి  అధికారుల చర్యలపై స్థానికంగా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గాయపడిన వారికి బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు జరిపారు. ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడంతో ఆయా గ్రామాల వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Stories: