రష్యా ట్రియంఫ్‌లపై ముందుకు వెళ్లనివ్వండి

అమెరికాను కోరనున్న భారత్ ..టు ప్లస్ టు భేటీ కీలకం న్యూఢిల్లీ : రష్యా నుంచి ఎస్ 400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ శ్రేణిని సంతరించుకోవడంపై భారతదేశం పట్టుదలతో ఉంది. రష్యా నుంచి ఈ వ్యవస్థల సమీకరణ గురించి అమెరికాకు టు ప్లస్ టు చర్చల సందర్భంగా భారతదేశం తెలియచేయనుంది. భారత్‌అమెరికాలకు చెందిన రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయి భేటీని టు ప్లస్ టు సమావేశంగా వ్యవహరిస్తున్నారు. పలు ఎస్ 400 ట్రియంఫ్ వైమానిక […]

అమెరికాను కోరనున్న భారత్ ..టు ప్లస్ టు భేటీ కీలకం

న్యూఢిల్లీ : రష్యా నుంచి ఎస్ 400 ట్రియంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ శ్రేణిని సంతరించుకోవడంపై భారతదేశం పట్టుదలతో ఉంది. రష్యా నుంచి ఈ వ్యవస్థల సమీకరణ గురించి అమెరికాకు టు ప్లస్ టు చర్చల సందర్భంగా భారతదేశం తెలియచేయనుంది. భారత్‌అమెరికాలకు చెందిన రక్షణ, విదేశాంగ మంత్రుల స్థాయి భేటీని టు ప్లస్ టు సమావేశంగా వ్యవహరిస్తున్నారు. పలు ఎస్ 400 ట్రియంఫ్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను సంతరించుకోవడం భారతదేశం భద్రతాపరంగా అత్యంత వ్యూహాత్మక కీలక అంశంగా భావిస్తోంది. అయితే రష్యాపై అమెరికా విధించిన సైనిక లావాదేవీల ఆంక్షలు ఇప్పుడు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ ఆంక్షల ప్రభావం తమపై పడకుండా రష్యాతో సైనిక ఆయుధాల లావాదేవీలను నెరిపేందుకు అవకాశం కల్పించాలని అమెరికాను భారత్ కోరనుందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.

రష్యాతో సైనిక లావాదేవీలు పెట్టుకోవడం వల్ల తమపై ఆంక్షలు ఉండకుండా చూడాలని ట్రంప్ అధికార యంత్రాంగాన్ని టు ప్లస్ టు చర్చలలో కోరనున్నారు. రష్యాతో భారత్‌కు ఉన్న సన్నిహిత భద్రతా సంబంధాలు, మరోవైపు ప్రాంతీయ స్థాయిలో తలెత్తుతున్న ప్రమాదకర భద్రతా మౌలిక వ్యవస్థల నేపథ్యంలో ఈ క్షిపణి వ్యవస్థ ఆవశ్యత ఉందని అమెరికాకు తెలియచేయనున్నారు. ఇప్పటికే రష్యాతో భారతదేశం ఈ వ్యవస్థకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ దిశలోనే ముందుకు వెళ్లాల్సి ఉంది. ఈ వ్యవస్థను సంతరించుకోవడంలో ఉన్న అనివార్యతను అమెరికాకు తెలియచేస్తామని ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.

Comments

comments

Related Stories: