రష్యన్ యువకుడితో శ్రియ పెళ్లి..?

ముంబయి: ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా రష్యన్ యువకుడితో చెట్టపట్టాలేకుంటూ తిరుగుతున్న శ్రియ, అతడితోనే పెళ్లికి సిద్ధమైన్నట్లు సమాచారం. పెళ్లి విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. మార్చిలో రాజస్థాన్ వేదికగా శ్రియ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై శ్రియ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన […]

ముంబయి: ఇటు తెలుగు, అటు తమిళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ శరణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది. గత కొంతకాలంగా రష్యన్ యువకుడితో చెట్టపట్టాలేకుంటూ తిరుగుతున్న శ్రియ, అతడితోనే పెళ్లికి సిద్ధమైన్నట్లు సమాచారం. పెళ్లి విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. మార్చిలో రాజస్థాన్ వేదికగా శ్రియ పెళ్లి జరుగనుందని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై శ్రియ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు. 15 ఏళ్ల క్రితం ఇష్టం అనే తెలుగు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రియ 35 ఏళ్ల వయసులోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తెలుగు, తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో పాటు యువ నటులతో కూడా జతకట్టింది శ్రియ. బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు సరసన గాయత్రి అనే మూవీలో నటించింది. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

Related Stories: