ఆ ద్వీపానికి వీసా ఫ్రీ…!

Iland

ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే చైనాలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎప్పుడు టూరిజంకి సంబంధించిన వాటిపై ఏదో ఒకటి కొత్త వాటిని తయారుచేస్తుంటారు. అప్పట్లో గ్లాస్‌తో నిర్మించిన బ్రిడ్జిని నిర్మించారు. ఇంకా అక్కడ దేవాలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చైనాకి వెళ్లాలంటే అక్కడ వీసా నిబంధనలు కఠినంగా ఉంటాయని అంటుంటారు. కానీ చైనా దక్షిణ ప్రాంతంలోని హైనన్ ద్వీపానికి వీసా లేకుండానే సందర్శకులను ఆహ్వానిస్తోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సహా 59 దేశాలకు చెందిన సందర్శకులకు 30 రోజుల పాటు ఈ ద్వీపంలో ఎలాంటి వీసా లేకుండా పర్యటించడానికి వీలుంటుందని అక్కడి అధికారులు ప్రకటించారు.

హైనన్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి ఈ విధానం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 2010లోనే చైనా 21 దేశాలకు చెందిన పర్యాటకులకు 15 రోజుల పాటు వీసా లేకుండా హైనన్‌లో పర్యటించే అవకాశం కల్పించింది. ఆ తర్వాత 2010లో ఆ సంఖ్యను 26కు పెంచింది. ఈ నిర్ణయం తర్వాత పర్యాటకంగా అభివృద్ధి జరగడంతో పాటు, ఆదాయం పెరిగింది.. తాజాగా దీనిని 59 దేశాలకు పొడిగించటంతో అక్కడ గడిపే సమయాన్ని మరింత పెంచింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రానికి ఉండాల్సిన అన్ని అనుకూలతలు హైనన్‌లో ఉండటంతో భారీగా ఆదాయం రాబట్టడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు చాలా వరకు చైనాకి పర్యాటకుల సంఖ్య ఎక్కువైపోయింది.

Comments

comments