రవాణా వ్యవస్థ..

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : కొత్త జిల్లా ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇంకా రవాణా వ్యవస్థ మెరుగు పడలేకపోయింది.  జిల్లాలోని 18 మండలాలు ఉండగా పలు మండలాలకు మెరుగైన రవాణా సేవలు లేకపోవడం విచారకరం. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఆర్టీసి బస్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది. అస్సలు బస్సులు లేని గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటీవల పలు షటిల్ సర్వీసులు ప్రారంభించినా కొన్ని రూట్లకే పరిమితం చేశారు. మండల […]

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : కొత్త జిల్లా ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఇంకా రవాణా వ్యవస్థ మెరుగు పడలేకపోయింది.  జిల్లాలోని 18 మండలాలు ఉండగా పలు మండలాలకు మెరుగైన రవాణా సేవలు లేకపోవడం విచారకరం. గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఆర్టీసి బస్సులు కూడా సరిగ్గా లేని పరిస్థితి నెలకొంది. అస్సలు బస్సులు లేని గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇటీవల పలు షటిల్ సర్వీసులు ప్రారంభించినా కొన్ని రూట్లకే పరిమితం చేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా కనీసం రోజుకు ఒకటి, రెండు చొప్పున ఆర్టీసి సేవలు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో మెరుగైన రవాణా సేవలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అంటున్నారు.  బషీరాబాద్, యాలాల, దోమ, కులకచర్ల, బొంరాస్‌పేట, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల నుంచి బస్సు సౌకర్యం కల్పించాల్సి ఉన్నది. ఈ మండలాలు జిల్లా కేంద్రానికి దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి.  గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మరీ గగనంగా మారేది. కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత వికారాబాద్‌కు వెళ్లేందుకు కాస్త ఫర్వాలేదని అంటున్నారు. అయినప్పటికీ మరింత మెరుగైన రవాణా సేవలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నారు. బషీరాబాద్ మండలం మైల్వార్, ఎక్మాయి, జలాల్‌పూర్, నీళ్లపల్లి, పర్వత్‌పల్లి, జీవన్గి, కొడంగల్ మండలం అంగడిరాయిచూర్, రుద్రారం, ఇందనూరు, కస్తూర్‌పల్లి, చంద్రకల్, దౌల్తాబాద్ మండలం బాలంపేట, చెల్లాపూర్, ఈర్లపల్లి, యాంకి, గోకఫస్లావాద్, కులకచర్ల, దోమ మండలాలలో చాలా గ్రామాలు జిల్లా కేంద్రానికి దూరాన ఉన్నాయి. 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉన్నందున నేరుగా బస్సు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసి అధికారులపై ఉందని అంటున్నారు. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు పట్టణాలోల ఆర్టీసి డిపోలు ఉన్నాయి. ఈ మూడు డిపోలలో 210 బస్సులు నడుస్తున్నాయి. ఎక్కువగా రాబడి ఉన్న ప్రాంతాలకే వాటిని నడుపుతుంటారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, యాద్గిర్ తదితర దూర ప్రాంతాలకు నస్తున్నాయి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు పడుతున్న అవస్థలు దృష్టిలో పెట్టుకుని రవాణా సేవలు కల్పించాలని అంటున్నారు. జిల్లాలో ఉన్న మూడు డిపోల ద్వారా రోజుకు రూ.15 లక్షల రాబడి సమకూరుతున్నది. అదనపు బస్సులను పెంచి మండల కేంద్రాలకు నడిపితే మరింత రాబడి సమకూరుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
వజ్ర మొహం చూసేదెన్నడో…
ఇంధనం ఆదా, నిర్ణీత సమయంలో గమ్యస్థానం చేర్చాలన్న లక్షంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతేడాది క్రితం మినీ బస్సులను ప్రవేశపెట్టింది. వజ్ర పేరుతో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన మినీ బస్సులను ఉత్తర తెలంగాణ ప్రాంతానికే ఎక్కువగా నడుపుతున్నారు. నిజామాబాద్, వరంగల్ వంటి నగరాలకే వాటిని పరిమితం చేయడం వల్ల అధికారులపై విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జిల్లాలకు వెళ్లే మినీ బస్సులు అనేక జిల్లాలను కవర్ చేస్తున్నాయి. దక్షిణ ప్రాంతంలో ఉన్న వికారాబాద్ జిల్లాకూ వజ్ర బస్సులు నడపాలని డిమాండ్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరు, కొడంగల్ వరకు నేరుగా మినీ బస్సులు నడిపితే సౌకర్యవంతంగా మారుతుందని అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మినీ బస్సులపై ఇంతకాలం ఊసెత్తకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వజ్ర బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయడం తగదని ప్రయాణికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు వజ్ర బస్సులు వికారాబాద్ జిల్లాకు నడిపేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
బస్‌స్టేషన్‌లు వెలవెల
జిల్లాలోని మండల కేంద్రాల్లో నిర్మించిన బస్‌స్టేషన్లలోకి బస్సులు వెళ్లకపోవడం గమనార్హం. పెద్దేముల్, కులకచర్ల, బషీరాబాద్, యాలాల, నవాబ్‌పేట మండల కేంద్రాల్లో 25 ఏండ్ల క్రితం నిర్మించిన బస్‌స్టేషన్లు వెలవెలబోతున్నాయి. బస్సులు బయట నుంచే వెళుతున్నందున ప్రయాణికులు స్టేషన్‌లోకి రావడం లేదు. వర్షమొచ్చినా, ఎండ నుంచి తట్టుకునేందుకే 1988లో వాటిని నిర్మించారు. బషీరాబాద్ బస్‌స్టేషన్ కొన్నేళ్ల క్రితమే నిర్మించినా ఒక్క బస్సు కూడా లోపలకు వెళ్లడం లేదు. యాలాల బస్‌స్టేషన్ చుట్టూ ఇటీవల లక్షల రూపాయలు వెచ్చించి ప్రహరీగోడ నిర్మించారు. పెద్దేముల్ బస్‌స్టేషన్‌ను కొంతమంది పశువుల కొట్టంగా మార్చారు. మన్నెగూడ, ధారూరు, మోమిన్‌పేట బస్‌స్టేషన్‌లకు కూడా పలుమార్లు బస్సులు వెళ్లడం లేదు. దీనిపై తరచూ ఆర్టీసి అధికారులు హోంగార్డులను ఏర్పాటు చేసి బస్సులు వెళ్లేలా చేస్తున్నా డ్రైవర్లు విస్మరిస్తున్నారు. ఈ బస్సులను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు బస్‌స్టేషన్లలో తలుపులు, కిటికీలు ధ్వంసమైనాయి.

Comments

comments

Related Stories: