రజత్‌కుమార్‌కు సిఇసి నుంచి పిలుపు

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపురావడంతో శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినట్లు గురువారం సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపామని రజత్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఆయనతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఉదయం  జిల్లా కలెక్టర్లతో రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్లతో ఈ సమావేశంలో ఆయన చర్చించారు. ఎన్నికల సమయం వరకు […]

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపురావడంతో శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినట్లు గురువారం సాయంత్రమే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపామని రజత్ కుమార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఆయనతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించే అవకాశం ఉంది. ఇక ఇవాళ ఉదయం  జిల్లా కలెక్టర్లతో రజత్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్లతో ఈ సమావేశంలో ఆయన చర్చించారు. ఎన్నికల సమయం వరకు అన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించినట్లు సమాచారం.

Comments

comments

Related Stories: