రక్షతి రక్షితః

ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది భారీస్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని రక్షించుకోవాలి గ్రీన్ బెటాలియన్స్ తరహాలో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలి గజ్వేల్‌లో నాలుగో విడత హరితహారం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు ఆనందోత్సాహాలతో పాల్గొన్న జనసందోహం లక్షానికి మించి 1,36,000 మొక్కలు నాటిన ప్రజలు మన తెలంగాణ/హైదరాబాద్:‘ప్రకృతిని మనం కాపాడితే… ఆ ప్రకృతి మనల్ని కాపాతుంది. ప్రకృతి కన్నెర్ర జేస్తే మన మనుగడ కష్టం. అం దువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతిని పూజించాలి. అప్పుడే వానదేవుడు […]

ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది

భారీస్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని రక్షించుకోవాలి
గ్రీన్ బెటాలియన్స్ తరహాలో పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలి
గజ్వేల్‌లో నాలుగో విడత హరితహారం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు
ఆనందోత్సాహాలతో పాల్గొన్న జనసందోహం
లక్షానికి మించి 1,36,000 మొక్కలు నాటిన ప్రజలు

మన తెలంగాణ/హైదరాబాద్:‘ప్రకృతిని మనం కాపాడితే… ఆ ప్రకృతి మనల్ని కాపాతుంది. ప్రకృతి కన్నెర్ర జేస్తే మన మనుగడ కష్టం. అం దువల్ల ప్రతి ఒక్కరూ ప్రకృతిని పూజించాలి. అప్పుడే వానదేవుడు కూడా కరుణిస్తాడు” అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కలు నాటి పచ్చదనాన్ని రక్షించడం కోసం ‘గ్రీన్ బెటాలియన్స్’ తరహాలో పకడ్బందీ ప్రణాళికలను రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖలో సైతం ఒక్కో పోలీసు బెటాలియన్ గ్రీన్ బెటాలియన్‌గా మారి ఒక్కో అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అడవుల పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.‘తెలంగాణకు హరితహారం’ నాలు గో విడత కార్యక్రమంలో భాగంగా కెసిఆర్ బుధవారం గజ్వేల్‌లో విస్తృతంగా పర్యటించారు.  గజ్వేల్‌తో పాటు మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో నాలుగు చోట్ల మొక్కలు నాటారు. గజ్వేల్‌లోని బస్టాండ్ చౌరస్తాలో కదంబం మొక్కను నాటా రు. గజ్వేల్ మున్సిపాలిటి పరిధిలో ఒకే రోజు లక్షా నూట పదహారు మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సిఎం మొక్కలు నాటే సందర్భంగా గజ్వేల్ ప్రాం తమంతా మేఘావృతమై ఓ మోస్తరు వర్షం కురిసింది. శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి, ములు గు, ప్రజ్ఞాపూర్ గ్రామాలలో ఆయన మొక్కలను నాటారు. గజ్వేల్‌లోని రాజీవ్ రహదారిపై ‘ఆకాశమల్లి’ మొక్కను, అనంతరం ప్రజ్ఞాపూర్‌లో నాగరాజు అనే గ్రామస్తుని నివాసంలో కొబ్బరి తో పాటు గృహ అవసరాలకు ఉపయోగపడే మొక్కలను నాటారు. నాగరాజు కుటుంబ సభ్యులను పలకరించి మంచి చెడులను తెలుసుకున్నారు. మొదట 1,00,116 మొక్కలు నాటాలనుకున్నప్పటికీ ప్రజల నుంచి అనూహ్య స్పం దన రావడంతో 1,36,000 మొక్కలను గజ్వేల్ మున్సిపాలిటీ ప్రాంతంలో ప్రజలు నాటారు. అంతకు ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గజ్వేల్‌కు వెళ్తున్న సిఎం కెసిఆర్ దారిలో సింగాయపల్లి అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళి అక్కడి పరిస్థితులను, అడవి స్వభావాన్ని పరిశీలించారు. తన వెంట  వచ్చిన ఎంపిలు, ఎంఎల్‌ఎలకు
ఫారెస్టు చూపించి ‘మీ నియోజకవర్గాలలో కూడా ఇలాగే అడవుల పునరుద్దరణకు కృషి చేయాల’ని సూచించారు. అటవీ పరిరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు. ఫారెస్ట్ అధికారులకు ప్రొత్సాహకంగా రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు సిఎం ప్రకటించారు. ఇంకా అవసరమైన సిబ్బందిని, కావాల్సినంత బడ్జెట్‌ను ఇస్తామని సిఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అడవుల పెంపకంలో భాగంగా భారీ స్థాయిలో మొక్క లు నాటే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘వనదర్శిని’ కార్యక్రమం పేరుతో ఒక రోజు శాసనసభ్యులందిరినీ గజ్వేల్ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి అడవుల పునరుద్ధరణ మీద అవగాహన కల్పించాలన్నారు. ఎంఎల్‌ఏలకు కూడా హరితహారం మీద శ్రద్ధ పెరగడంతో పాటు వారికి వనభోజనాలకు వచ్చిన తృప్తి కలుగుతుందని సిఎం వ్యాఖ్యానించారు. సింగాయపల్లి ఫారెస్టు బ్లాక్ వద్ద అటవీ పునరుజ్జీవనం గురించి వివరాలు తెలుసుకున్నారు. జోగురామన్న, పిసిసిఎఫ్ పికె ఝా తదితరులు సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం వెంట మంత్రి హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి,కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు,సుధీర్‌రెడ్డి, టిఎస్‌ఎండిసి చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, సిఎంఓ అధికారులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ పికె.ఝా, అడిషనల్ పిసిసిఎఫ్ డోబ్రియల్, మెదక్ చీఫ్ కన్జర్వేటర్ ఏకె సిన్హా ఉన్నారు.
ప్రార్ధనా మందిరాల్లో మోగిన సైరన్ : మొదలైన మొక్కల నాటే కార్యక్రమం
గజ్వేల్‌లో సిఎం మొక్క నాటుతున్న సమయంలో అన్ని ప్రార్ధనా మందిరాల్లో సైరన్ మోగించగానే ప్రజలందరూ ఒకేసారి మొక్కలు నాటారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంట్లో, రోడ్లకు ఇరువైపులా, ఔటర్ రింగు రోడ్డుపైనా,ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్ధనా మందిరాల్లో, ప్రభు త్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా ఎదిగిన, ఆరోగ్యవంతమైన మొక్కలను నాటారు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్లనేరడు, కరివేపాకు, మునగ మొక్కలను గజ్వేల్ వాసులు తమ ఇండ్లల్లో నాటుకున్నారు. గజ్వేల్ పట్టణాన్ని ఎనిమిది క్లస్టర్లుగా విభజించి ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో క్లస్టర్‌లో 15వేలకు పైగా మొక్కలు నాటారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరడు), 16 వేల పూల మొక్కలు, పదివేల అటవీ జాతులకు చెందిన మొక్కలను నాటారు. పట్టణ ప్రాంతానికి నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతీ ఇంటికి రోజు ఉపయోగపడే కరివేపాకు, మునగలాంటి మొక్కలు నాటారు. ఇళ్ళ ముందు, వెనుకా ఉన్న ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేసి వాటిని నాటించారు. బహిరంగ ప్రదేశాల్లో నాటిన అన్ని మొక్కల రక్షణ కోసం ‘ట్రీ గార్డు’లను అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తమ ఇండల్లో, ఇంటి ముందు నాటిన మొక్కలను తమ కుటుంబ సభ్యులుగా, పిల్లా పాపల్లాగా ఆప్యాయంగా చూసుకుని, నీరుపోసి రక్షణ ఏర్పాట్లు చేసి పెంచాలని గజ్వేల్ వాసులకు సిఎం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ ‘మహా హరితహారం’ కార్యక్రమంలో1778 మంది ఉద్యోగులు,13000 మంది వర్కర్లు, 12,000 మంది కుటుంబాల నుండి 45,000 మంది ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గజ్వేల్ హరితహారం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి ఏర్పాట్లు చేసిన అటవీ శాఖ అధికారులకు, పోలీసు శాఖకు సిఎం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆశీర్వదించిన వానదేవుడు : హరితహారానికి వానజల్లు
గజ్వేల్‌లో ప్రారంభమైన ‘హరితహారం’ను వరుణదేవుడు ఆశీర్వదించాడు. హరితహారం నాలుగో విడత కార్యక్రమాన్ని ఆయన హర్షిస్తూ స్వాగతం పలికినట్లుగా చిరు జల్లులు కురిపించాడు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమైంది. మొక్కలు నాటడం మొదలుపెట్టగానే సన్నటి జల్లుతో కొద్దిసేపు చినుకులు పడ్డాయి. హరితహారం కార్యక్రమానికి అభినందనలు తెలియజేయడానికే వానదేవుడు వర్షాన్ని కురిపించారని అని గజ్వేల్ పట్టణ వాసులు ఆనందంతో పులకరించిపోయారు. ఇది యాధృచ్ఛికంగానే జరిగినప్పటికీ సిఎం కెసిఆర్ మంచి మనస్సుతో నిర్వహిస్తున్న హరితహారానికి కూడా దేవుళ్ళు సైతం తమ వంతు సహకారాన్ని వర్షం రూపంలో ఇస్తున్నారని గజ్వేల్ ప్రాంత వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కూడా కాపాడుతుందని, సకాలంలో వర్షాలు కురిసేందుకు దోహదపడుతుందని సిఎం కెసిఆర్ తరుచూ హరితహారం కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచినట్లు అయిందని ప్రజలు గుసగుసలాడుకున్నారు.

వరుణుడి ఆశీస్సులు

గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కలు నాటడం మొదలుపెట్టగానే సన్నటి జల్లులు కురిశాయి. హరితహారం కార్యక్రమానికి అభినందనలు తెలియజేయడానికే వానదేవుడు వర్షాన్ని కురిపించాడంటూ అక్కడ ప్రజలు ఆనందంతో పులకరించి పోయారు. యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ సిఎం కెసిఆర్ మంచి మనస్సుతో నిర్వహిస్తున్న హరితహారానికి  దేవుళ్ళు సహకారాన్ని ఇస్తున్నారని గజ్వేల్ ప్రాంత వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related Stories: