రక్త పరీక్షలకై ఎదురు చూపులు

గుడిహత్నూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష నిపుణుడు(ల్యాబ్ టెక్నిషియన్) లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇక్కడి టెక్నిషయన్ జీవన్‌ను ఇచ్చోడ ఆరోగ్య కేంద్రానికి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుడిహత్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎప్పుడు రోగులతో కిటకిటలాగుతు ఉంటుంది. ప్రసవాలు సైతం అధికంగానే జరుగుతున్నాయి. నిత్యం రెండు వందలకు పైగా రోగులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం వస్తుంటారు. వీరిలో 60 మందికి పైగా రోగులకు వైద్యులు […]


గుడిహత్నూర్‌: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష నిపుణుడు(ల్యాబ్ టెక్నిషియన్) లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఇక్కడి టెక్నిషయన్ జీవన్‌ను ఇచ్చోడ ఆరోగ్య కేంద్రానికి ఉన్నతాధికారులు బదిలీ చేశారు. గుడిహత్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎప్పుడు రోగులతో కిటకిటలాగుతు ఉంటుంది. ప్రసవాలు సైతం అధికంగానే జరుగుతున్నాయి. నిత్యం రెండు వందలకు పైగా రోగులు వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం వస్తుంటారు. వీరిలో 60 మందికి పైగా రోగులకు వైద్యులు రక్త పరీక్షలకై సిఫారసు చేస్తుంటారు. గర్భిణీలకు అవసరమైన రక్త పరీక్షలైన హిమోగ్లోబిన్, హెచ్‌ఐవీతో పాటు సాధారణ వ్యాధులైన టైఫాయిడ్, మలేరియా తదితర వ్యాధులకు నిత్యం రక్త పరీక్షలు చేసేవారు. ఇక్కడ టెక్నిషియన్‌ను అధికారులు బదిలీ చేయడంతో గత 15 రోజులుగా ల్యాబ్ తలపులు తెరుచుకోలేదు. ఆదిలాబాద్ నుండి ఇక్కడకు బదిలి అయిన ల్యాబ్ టెక్నిషియన్ విధుల్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేస్తు కోర్టును ఆశ్రయించి యధాస్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇచ్చోడ ఆరోగ్య కేంద్రంలో ఇప్పటికే ఇద్దరు టెక్నిషియన్లు విధులు నిర్వహిస్తుండగా ఇక్కడి టెక్నిషియన్‌ను కూడా అక్కడికి బదిలీ చేయడంతో అక్కడ టెక్నిషియన్ల సంఖ్య ముగ్గురికి చేరగా ఉన్న ఒక్క టెక్నిషియన్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేయడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బదిలిపై వెళ్లిన ల్యాబ్ టెక్నిషియన్‌ను తిరగి గుడిహత్నూర్‌కు పంపించడం లేదా మరోకరిని నియమించి రోగుల ఇక్కట్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

Related Stories: