యూనివర్సిటీల పనితీరు సంతృప్తికరం : గవర్నర్

Universities Performance Is Satisfactory : Governor

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విసిల కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. యూనివర్సిటీల్లో కామన్ అకాడమిక్ క్యాలెండర్ అమలవుతుందని ఆయన పేర్కొన్నారు. బయోమెట్రిక్ మిషన్లతో విద్యలో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలని, అవసరం లేని కోర్సులను తొలగించాలని ఆయన విసిలకు సూచించారు. పిహెచ్‌డి ప్రవేశాల్లో ఒకే విధానం అమలు చేయాలన్నారు. మహిళలు, విద్యార్థినుల భద్రతకు యూనివర్సిటీలు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Universities Performance Is Satisfactory : Governor