యువత నిర్లక్ష్యం.. ఒకరి ప్రాణం తీసింది…

యాదాద్రి భువనగిరి: వేగంగా వస్తున్న ఇన్నోవా కారును గమనించి కుండా స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డుదాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బిబినగర్ మండలం కొండమడుగుకు సమీపంలో ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్న విద్యార్థులను వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఆరోరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరీక్ష రాసేందుకు స్కూటీపై వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రిపుల్ రైడింగ్, పైగా  స్కూటీ నడుపుతున్న యువకుడు […]

యాదాద్రి భువనగిరి: వేగంగా వస్తున్న ఇన్నోవా కారును గమనించి కుండా స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డుదాటే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బిబినగర్ మండలం కొండమడుగుకు సమీపంలో ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్కూటీపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వెళ్తున్న విద్యార్థులను వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఆరోరా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పరీక్ష రాసేందుకు స్కూటీపై వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రిపుల్ రైడింగ్, పైగా  స్కూటీ నడుపుతున్న యువకుడు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఇక అటువైపు నుంచి వస్తున్న కారు డ్రైవర్ కూడా వీరిని గమనించక పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.

Comments

comments

Related Stories: