యువతి అనుమానాస్పద మృతి…

సిద్దిపేట: యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలోని తడ్కపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికంగా నివాసముండే అన్నపూర్ణ(26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని చుట్టుపక్కలవారు గుర్తించారు. అయితే, ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్నపూర్ణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వారు ఆరోపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు […]

సిద్దిపేట: యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లాలోని తడ్కపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికంగా నివాసముండే అన్నపూర్ణ(26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని చుట్టుపక్కలవారు గుర్తించారు. అయితే, ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్నపూర్ణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ వారు ఆరోపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

comments

Related Stories: