యువకుడు ఆత్మహత్య!

Young Man Committed Suicide in Medchal

మేడ్చల్: పెళ్లి కావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నర్సింహ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి కాప్రా సర్కి ల్, చర్లపల్లిలో నివాసముంటున్నాడు. కాగా, నర్సింహ కుమారుడు రజినీకాంత్(34) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో రజినీకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు నర్సింహ. కానీ చాలా కాలంగా ఏ సంబంధాలు కుదురడం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన రజినీకాంత్ శనివారం రాత్రి చర్లపల్లి ఫేస్-2లోని వివేకనందనగర్ చెట్ల పొదల్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవ పరీక్ష నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

comments