యువకుడు ఆత్మహత్య..

సంగారెడ్డి: అనారోగ్యంతో అవస్థలు పడుతున్న ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటకలోని మాలేగాం గ్రామానికి చెందిన తుకారం హైద్రాబాద్‌లో తన తల్లితో కలిసి నివాసం ఉంటు స్వీట్ హౌజ్‌లో పని చేసుకుంటూ.. జీవనం కొన్నసాగిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన హైద్రాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు పయనమయ్యాడు. కర్ణాటకలోని బీదర్ పట్టణంలో తన తండ్రి గుండప్పను కలిసి కొంత మొత్తం అందించి తాను తర్వాత […]


సంగారెడ్డి: అనారోగ్యంతో అవస్థలు పడుతున్న ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నాటకలోని మాలేగాం గ్రామానికి చెందిన తుకారం హైద్రాబాద్‌లో తన తల్లితో కలిసి నివాసం ఉంటు స్వీట్ హౌజ్‌లో పని చేసుకుంటూ.. జీవనం కొన్నసాగిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన హైద్రాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు పయనమయ్యాడు. కర్ణాటకలోని బీదర్ పట్టణంలో తన తండ్రి గుండప్పను కలిసి కొంత మొత్తం అందించి తాను తర్వాత వస్తానని తండ్రిని గ్రామానికి పంపించి వెళ్లిపోయాడు. రాత్రి కుమారుడు గ్రామానికి తిరిగి రాకపోవడంతో తల్లి కొడుకుకు, భార్తకి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళన చెంది తమ బందువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోయింది.

బంధువులు తుకారం కానరాకుండా పోయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వార ప్రచారం చేశారు. అయితే మండలంలోని శంశల్లాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సోషల్ మీడియాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలను ఫోస్టు చేయడంతో తుకారం కుటుంబ సభ్యులు అనుమానంతో అక్కడికి చేరుకుని శవాన్ని పరిశీలించగా తుకారందిగా గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుని తండ్రి గుండప్ప ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎఎస్‌ఐ ఈశ్వరయ్య వివరించారు.

Comments

comments