యురేనియం తవ్వకాలు చేపడితే అడ్డుకుంటా!

Guvvala-balraju

అమ్రాబాద్‌ః నల్లమలలోని అమ్రా బాద్, పదర మండలాలలో ప్రభుత్వం యురేనియం తవ్వకాలు చేపడితే ప్రజల పక్షాన పోరాడుతానని అ చ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండు ఆవర ణలో జానపద కళాకారుల సంఘం ఆధ్వ ర్యంలో ప్రజా వ్యతిరేక బహిరంగ సభకు మండలం లోని కళాకారులు వివిధ గ్రామాల ప్రజలు హాజరై య్యారు. ఈ కార్య క్రమానికి స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ యురే నియం తవ్వకాల పట్ల ప్రజలు భయందోళనకు గురి కాకుండా ఉండాలని ఆయన కోరారు.కొందరు రాజకీయ లబ్ధి కోసం నల్లమలలో ప్రజలను భయ భ్రాం తులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే ఈ ప్రాంత ప్రజల పక్షాణ పోరాటం చేస్తానని ఆయన హామి ఇచ్చారు. ఈ సందర్భంగా మండల రైతులు ఈ ప్రాంతానికి సాగునీరు అంధించాలని ఎమ్మెల్యేను కోరాగా ఆయన స్పందిస్తూ రెండు మండలాలకు సంబంధించిన 30వేల ఎకరాలకు సాగునీరు తేవ డంమే నాఏకైక లక్షం మని తెలియజేశారు. అమ్రా బాద్ మండలం సముద్ర మట్టానికి 668 అడు గుల ఎత్తు ఉండాటం ములంగా నీళ్ళు రావటం కష్టంగా ఉందన్నారు. తప్పక ఈ ప్రాంతానికి సాగు నీరు తేవడం కొరకు వృషీ చేస్తానని ఆయన అన్నారు. ము ఖ్యమంత్రి కెసీఆర్ తెలంగాణలో ఒంటరి మహి ళలను ఆదుకోవాలనే సంకల్పంతో వారికి వెయ్యి రూ పాయల జీవన భృతి అందించడం కొరకు అసెంభ్లిలో తిర్మాణం చేశారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లోజిల్లా ప్రజా మిత్ర చైతన్య వేదిక అధ్యక్షులు కల్ముల నాసరయ్య,అమ్రాబాద్ ఎంపిపి రామచంద్రమ్మ, అ చ్చంపేట ఎంపిపి పర్వతాలు,అమ్రాబాద్ సర్పంచ్ అంజమ్మ,కల్ములోనిపల్లి సర్పంచ్ చిట్టెమ్మ,జంగంరెడ్డి పల్లి సర్పంచ్ చిట్టెమ్మ టిఆర్‌ఎస్ నాయకులు చెన్న కేశువులు, మండల అధ్యక్షులు వీరప్ప,అనిల్ వెంక టయ్య, అల్లయ్య, రాజలింగం పాల్గొన్నారు.

Comments

comments