యుపిలో భూకంపం

Earthquake in UP

ఢిల్లీ : యుపిలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. యుపిలోని మీరట్ నుంచి 6కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్కౌదాలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. యుపిలో భూకంపం రావడంతో ఢిల్లీలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ఆదివారం హర్యానాలోని జజ్జర్ జిల్లాలో భూకంపం రావడంతో ఢిల్లీలో కూడా భూమి కంపించింది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.

Earthquake in UP

Comments

comments