యుపిలో ఇద్దరు పూజారుల హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఇద్దరు పూజారులను కత్తులతో పొడిచి చంపారు. దేవాలయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కత్తిపోట్లతో ఇద్దరు చనిపోవడంతో పాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఔరేయియా జిల్లాలోని బిధునాలో ఉవ్వెత్తున హింసాకాండ చెలరేగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలోని కుదర్‌కోట్ ప్రాంతం లో ఉన్న భయానక్ నాథ్ గుడిలో ఈ పూజారులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. గుడిలో మధ్యాహ్నం సాధువుల హత్య జరిగిందనే విషయం తెలియగానే ఓ గుంపు దుకాణాలకు నిప్పంటించింది. రాళ్లు కూడా […]

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఇద్దరు పూజారులను కత్తులతో పొడిచి చంపారు. దేవాలయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కత్తిపోట్లతో ఇద్దరు చనిపోవడంతో పాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఔరేయియా జిల్లాలోని బిధునాలో ఉవ్వెత్తున హింసాకాండ చెలరేగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలోని కుదర్‌కోట్ ప్రాంతం లో ఉన్న భయానక్ నాథ్ గుడిలో ఈ పూజారులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. గుడిలో మధ్యాహ్నం సాధువుల హత్య జరిగిందనే విషయం తెలియగానే ఓ గుంపు దుకాణాలకు నిప్పంటించింది. రాళ్లు కూడా రువ్వారు. దీంతో వారి ని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులకు దిగాల్సి వచ్చిం ది. అయితే సాధువులు ఈ ప్రాంతంలో గో రక్షణకు పాటుపడుతున్నారని, గోవుల వధకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దీని వల్లనే వారి హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడ్డ వ్యక్తి కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున సాయాన్ని సిఎం యోగి ప్రకటించారు.

Comments

comments

Related Stories: