యుఎస్ ఓపెన్: ఫైనల్లోకి డెల్ పెట్రో

Juan Martin del Potro in US Open final

న్యూయార్క్: యుఎస్ ఓపెన్  గ్రాండ్‌స్లామ్ లో భాగంగా శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ లో అర్జెంటీనాకు చెందిన డెల్ పెట్రో ఫైనల్ కు దూసుకెళ్లాడు. సెమీ ఫైనల్ లో స్పెయిన్ స్టార్ ఆటగాడు రఫెల్ నాదల్ తో పెట్రో తలపడ్డాడు. అయితే, గాయం కారణంగా రెండో సెట్ లో మ్యాచ్ నుంచి నాదల్ తప్పుకోవడంతో పెట్రో ఫైనల్ కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్, జపాన్ సంచలనం నొవామి ఒసాకా ఫైనల్‌కు చేరుకున్నారు. మాజీ చాంపియన్ సెరెనా లాత్వియా క్రీడాకారిణి అనస్తాజియా సెవస్తోవాపై, ఒసాకా కిందటిసారి రన్నరప్, అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌ను ఓడించింది. సెరెనాఒసాకాలు ఫైనల్లో తలపడుతారు.

Comments

comments