యాసిడ్ దాడిలో 8మందికి తీవ్ర గాయాలు

బెంగళూరు : కర్నాటకలో పట్టణ, స్థానిక సంస్థలకు నాలుగు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. సోమవారం ఆ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా తుముకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ 16వ వార్డు నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ యాసిడ్ దాడిలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి చేసిందెవరో తెలియరాలేదు. […]

బెంగళూరు : కర్నాటకలో పట్టణ, స్థానిక సంస్థలకు నాలుగు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. సోమవారం ఆ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా తుముకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఇనాయతుల్లా ఖాన్ 16వ వార్డు నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో దుండగులు యాసిడ్ దాడి చేశారు. ఈ యాసిడ్ దాడిలో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి చేసిందెవరో తెలియరాలేదు. తుముకూరు పట్టణంలో మొత్తం 35 వార్డులు ఉన్నాయి. ఇందులో బిజెపి 12, కాంగ్రెస్ 10, జెడిఎస్ 10 వార్డులను గెలుచుకున్నాయి. మరో మూడు చోట్ల ఫలితాలు ఇంకా తేలలేదు.
కర్నాటక వ్యాప్తంగా మొత్తం 102 స్థానిక సంస్థలకు ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. 29 మున్సిపాలిటీలు, 53 పట్టణ మున్సిపాలిటీలు, 23 పట్టణ పంచాయతీలు, 3 సిటీ కార్పొరేషన్లలోని 135 వార్డులను కలుపుకుని మొత్తం 2,664 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే చాలా చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడంతో బిజెపి డీలా పడింది.

8 People Were Seriously Injured in Acid Attack

Comments

comments