యాపిల్ నుంచి కొత్త మాక్‌బుక్ ప్రొలు…

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన మాక్‌బుక్ ప్రొ లను తాజాగా రిలీజ్ చేసింది. 13, 15 ఇంచుల వేరియెంట్లలో ఈ మాక్‌బుక్ ప్రొలను విడుదల చేసింది. వీటిలో నూతన ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన మాక్‌బుక్ ప్రొల కన్నా ఈ మోడల్స్ 70 శాతం వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయని యాపిల్ కు చెందిన సంబంధిత అధికారులు చెబుతున్నారు. 15 ఇంచుల మాక్‌బుక్ ప్రొ (2018) మోడల్‌లో […]

ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ తన నూతన మాక్‌బుక్ ప్రొ లను తాజాగా రిలీజ్ చేసింది. 13, 15 ఇంచుల వేరియెంట్లలో ఈ మాక్‌బుక్ ప్రొలను విడుదల చేసింది. వీటిలో నూతన ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ప్రాసెసర్లను ఏర్పాటు చేసింది. గతంలో వచ్చిన మాక్‌బుక్ ప్రొల కన్నా ఈ మోడల్స్ 70 శాతం వేగవంతమైన ప్రదర్శనను ఇస్తాయని యాపిల్ కు చెందిన సంబంధిత అధికారులు చెబుతున్నారు.

15 ఇంచుల మాక్‌బుక్ ప్రొ (2018) మోడల్‌లో ఇంటెల్ కోర్ ఐ7/ఐ9 ప్రాసెసర్

32 జిబి వరకు ర్యామ్ సపోర్ట్, 4జి గ్రాఫిక్స్ మెమొరీ

4టిబి ఎస్‌ఎస్‌డి, టచ్ బార్, టచ్ ఐడి తదితర అద్భుత ఫీచర్లు ఉండగా ఈ మోడల్ ప్రారంభ ధర రూ.1,99,900 గా నిర్ణయించింది.

13 ఇంచుల మాక్ బుక్ ప్రొ (2018) మోడల్‌లో ఇంటెల్ క్వాడ్‌కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్,

2 టిబి ఎస్‌ఎస్‌డి, టచ్ బార్, టచ్ ఐడి తదితర అద్భుత ఫీచర్లు  అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.1,49,900 గా నిర్ణయించింది యాపిల్. ఇక ఈ రెండు మోడల్స్ జూలై చివరిలోగా మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని యాపిల్ సంస్థ వెల్లడించింది.

Related Stories: