యాక్షన్ ప్యాక్‌డ్ మూవీ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన  భారీ మల్టీస్టారర్  ‘నవాబ్’. అరవిందస్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరీ, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, త్యాగరాజన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం ఈనెల 27న తెలుగు, తమిళంలో విడుదలకానుంది. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ప్రతినిధులు మాట్లాడుతూ “యాక్షన్ ప్యాక్‌డ్ మూవీ ‘నవాబ్’. ఎమోషనల్ కంటెంట్‌తో సాగే ఈ […]

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన  భారీ మల్టీస్టారర్  ‘నవాబ్’. అరవిందస్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరీ, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, త్యాగరాజన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం ఈనెల 27న తెలుగు, తమిళంలో విడుదలకానుంది. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ ప్రతినిధులు మాట్లాడుతూ “యాక్షన్ ప్యాక్‌డ్ మూవీ ‘నవాబ్’. ఎమోషనల్ కంటెంట్‌తో సాగే ఈ చిత్రాన్ని మణిరత్నం అద్భుతంగా తెరకెక్కించారు. అరవిందస్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరి, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, త్యాగరాజన్ వంటి భారీ తారాగణంతో… ఎ.ఆర్.రెహమాన్, సంతోశ్ శివన్, శ్రీకర్ ప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది”అని అన్నారు.

Comments

comments

Related Stories: